Site icon NTV Telugu

OMG: కోపంతో ప్రియుడిపైకి ఐదు సార్లు కారు ఎక్కించి చంపిన ప్రియురాలు

Murder

Murder

OMG: అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్క సారి అనుమానం మొదలైందంటే గొడవలు ఆటోమేటిక్ గా వస్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే రిలేషన్‌షిప్‌ను చెడగొట్టుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ కావడం చాలా సార్లు చూసే ఉంటారు. ఓ మహిళ కూడా తన ప్రియుడితో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగింది. వివాదం పెరిగింది. ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది. కోపంతో చేసిన పనికి ఈ రోజు కటకటాలు లెక్కపెడుతుంది.

Read Also:Student Suicide: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఐ మిస్‌ యూ ఫ్రెండ్స్‌ అంటూ స్టేటస్

ఈ షాకింగ్ ఘటన చైనాలోని జెజియాంగ్‌కు చెందినది. జూన్ 28న 38 ఏళ్ల మహిళ తన 44 ఏళ్ల ప్రియుడిని కారుతో గుద్ది హత్య చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ ప్రదేశంలోని పార్కింగ్ ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైందని చెబుతున్నారు. ఆ తర్వాత ఆ మహిళ కోపాన్ని అదుపు చేసుకోలేక ఆగ్రహానికి గురైంది. అనంతరం ప్రియుడిని కారుతో గుద్దేసింది. అయినా ఆమె కోపం చల్లారకపోవడంతో ఆమె తన ప్రియుడి శరీరంపై ఐదుసార్లు కారును నడపడానికి ప్రయత్నించింది. హృదయ విదారకమైన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఫుటేజీలో ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Read Also: TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ

దీంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దాదాపు ఐదుసార్లు ఆ వ్యక్తిపై నుంచి కారును నడిపింది. ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కారు వదిలి పారిపోయింది. ఆమె కారు టైర్ కింద ప్రియుడి కాలు, కడుపు బాగా నలిగిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.

Exit mobile version