ప్రపంచంలో మానవులు తిండి తినకుండా బ్రతకడం చాలా కష్టం. అందుకోసం రోజు ఏదొకటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మరోవైపు కొందరు ఆహార ప్రియులు కూడా ఉంటారు. తమకు ఇష్టమైన తిండి కోసం ఎంతకైనా తెగిస్తారు. నచ్చిన ఆహారం కోసం నానా తంటాలు పడుతుంటారు. మరికొందరు మనుషులు వారి ఆహారశైలిలో వింత వింత పదార్థాలను సేకరిస్తుంటారు. ఉదాహరణకు.. కొందరికి మట్టి తినే అలవాటు, చాక్ పీస్, బలపాలు, గోధుమ పిండి, పాములు, క్రిమి కీటకాలు ఇలా వింత ఆహారాలను సేవిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ మహిళ వింత ఆహారాన్ని తింటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ మహిళ తినే ఆహారం పేరు వింటే మీకు వాంతులు రావడం ఖాయం.
Botsa Satyanarayana: చంద్రబాబు వల్లే పుంగనూర్ లో గొడవ జరిగింది..
ఇంతకీ ఆమే తింటుందంటే.. తను పెంచుకునే పెంపుడు పిల్లుల బొచ్చును తింటుంది. ఆ మహిళ పేరు లిసా. ఆమే అది తినడానికి మాత్రమే ఇష్టపడతానని స్వయంగా చెప్పింది. పిల్లి వెంట్రుకలను తినడం వల్ల ప్రమాదం అని తెలిసినప్పటికీ.. దాన్నే తింటుంది. దాంతో ఆ మహిళకు అల్సర్ వచ్చే ప్రమాదం ఉందని.. అంతేకాకుండా కడుపులో ఇతర రోగాలు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Tamilnadu: ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశంపై నిరాకరణ.. హైకోర్టు సీరియస్
ఆమే ఒక షోలో మాట్లాడుతూ.. ‘నేను పిల్లి వెంట్రుకలను తింటున్నానని.. 10 సంవత్సరాల క్రితం, తనకు ఒకే పిల్లి ఉండేదని.. ఇప్పుడు ఐదు ఉన్నాయని తెలిపింది. పిల్లుల బొచ్చు తడిపి, తింటున్నప్పుడు చాలా మృదువుగా ఉంటుందని పేర్కొంది. కొన్ని నివేదికల ప్రకారం.. లిసాకు పిల్లలు లేరని.. అటువంటి పరిస్థితిలో ఆమె పిల్లులను తన పిల్లలుగా భావించి ప్రేమిస్తుంది. మరోవైపు లిసా యొక్క ఈ వింత వ్యసనం గురించి తెలిసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు.. అదొక పిచ్చి అని అంటున్నారు. అలా బొచ్చు తినడం వల్ల ప్రేగు సమస్యలు వచ్చి.. ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు.