NTV Telugu Site icon

Viral Video: విమానంలో నెమలితో కనిపించిన అమ్మాయి.. ఎలా తీసుకొచ్చిందంటూ సందేహాలు

Peacock

Peacock

కొంతమంది జనాలు జంతువులు లేదా పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మాములుగా అయితే కుక్కలను చాలా మంది పెంచుకోవడం చూస్తుంటాం. మరికొందరు పిల్లులను పెంచుకోవడం చూస్తుంటాం. కాని వెరైటీగా ఓ మహిళ నెమలిని పెంచుకుంటుంది. నెమలిని పెంచుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోకండి. మీరు వింటున్నది నిజమే.. అంతేకాకుండా ఆ నెమలితో విమానం కూడా ఎక్కింది. ఫైట్ లో అమ్మాయి నెమలిని పట్టుకుని కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాములుగా అయితే కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులను యజమానులు తమతో పాటు ఊర్లకు తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఈ వీడియోలో నెమలిని తనతో పాటు విమానం ఎక్కించింది.

Read Also: Samantha: మరోసారి ప్రేమలో పడిన సామ్.. ఈసారి ఆంక్షలు కూడా

ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది తాము చూస్తున్నది నిజమేనా.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరొక వ్యక్తి.. నెమలితో ప్రేమ, ఇష్టం ఉండటం మంచిదే కానీ.. ఫ్లైట్‌లోకి ఎలా తీసుకెళ్లిందంటూ రాసుకొచ్చాడు. నెమలిని తీసుకెళ్తుంటే.. విమానంలోని సిబ్బంది మహిళను అడ్డుకోలేదా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.

Read Also: Chithha: చిత్తాగా వస్తున్న సిద్దార్థ్.. ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే

ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు. ఈ వీడియోలో ఓ మహిళ ఒడిలో నెమలి హాయిగా కూర్చున్నట్లు చూడవచ్చు. అంతేకాకుండా నెమలిని ఫ్లైట్‌లోకి తీసుకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆ నెమలి కూడా అటూ ఇటూ చూస్తోంది. దానికి పొడవాటి రెక్కలు ఉన్నాయి. అయితే ఈ నెమలి విమాన ప్రయాణంలో ఎలాంటి వివాదాలు జరగకూడదని మనం కూడా కోరుకుందాం. వాస్తవానికి జంతువులకు సంబంధించి విమానంలో ప్రయాణం ఉంటుందని తెలుసు కానీ.. పక్షులను కూడా అనుమతిస్తారా..!