NTV Telugu Site icon

Suicide Attempt: ఎస్పీ కార్యాలయ ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏమైందంటే..?

Up

Up

యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు.. తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ ఓ యువతి గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యువతి శాంతించింది.

UGC-NET: డార్క్‌నెట్‌లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్నం లీక్.. పరీక్ష రద్దు తర్వాత కేంద్రం ప్రకటన..

వివరాల్లోకి వెళ్తే.. జూన్ 16న ఖలీలాబాద్ లోని తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్తున్నట్లు మహిళ తెలిపింది. అయితే.. 6 నెలల క్రితం ఓ యువకుడిపై యువతి అత్యాచారం కేసు పెట్టింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు దారిలో అడ్డుకున్నాడు. అంతేకాకుండా.. యువతిని సిగరెట్ తో కాల్చి తన కారులోకి నెట్టాడు. అందులో ఉన్న ఓ వ్యక్తి, నిందితుడు కలిసి మరోసారి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను గొంతు నులిమి చంపాలని అనుకున్నారని, అంతేకాకుండా తన ఫోన్ పగులగొట్టారని బాధిత మహిళ తెలిపింది. ఎలాగోలా వారి వద్ద నుంచి బయటపడినట్లు చెప్పింది. అయితే.. పోలీసులు వారిపై కేసు నమోదు చేయకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ పేర్కొంది.

Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!

6 నెలల క్రితం యువతి వరకట్న వేధింపులు, అబార్షన్ పై యువకుడిపై కేసు పెట్టిందని సీఓ సదర్ బ్రజేష్ సింగ్ తెలిపారు. చర్చల సమయంలో ఆమె పెళ్లి విషయాన్ని తిరస్కరించింది. అంతేకాకుండా.. అతనిపై అత్యాచార ఆరోపణలు చేసింది. గతంతో యువతి రెండుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించింది. అయితే.. గతంలో నమోదైన అత్యాచారం, పోక్సో చట్టం కేసులో యువకుడు జైలుకు వెళ్లాడు. జూన్ 7న బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా.. నిందితుడు మరోసారి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిందిగా కొత్వాలి పోలీసులను ఆదేశించినట్లు ఎస్పీ సత్యజిత్ గుప్తా తెలిపారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా చర్యలు తీసుకుంటామన్నారు.