Woman attacks RTC Driver: తాను బస్సు ఆపేందుకు ప్రయత్నిస్తే.. ఆపకుండా వెళ్లిపోయాడంటూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు ఓ మహిళ.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సును నడిమివంక వద్ద ఆపాలని కోరింది ఓ మహిళా.. అయితే, డ్రైవర్ గమనించలేదా? లేదా కావాలనే చేశాడో తెలియదు.. కానీ, బస్సును మాత్రం ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు..
Read Also: href=”https://ntvtelugu.com/news/asia-cup-2025-suryakumar-yadav-fitness-update-shubman-gill-return-841852.html”>Asia Cup 2025: ‘సూరీడు’ ఫిట్‌నెస్‌తో లేడా?.. శుభ్‌మాన్ గిల్ రీఎంట్రీ!
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సుచరిత అనే మహిళ.. బైక్‌పై బస్సు ను ఓవర్ టేక్ చేసింది.. బస్సు ను ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది.. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుంది.. తోటి ప్రయాణికులు ఎంత వారించినా వెనక్కి తగ్గకుండా దాడికి పాల్పడింది మహళ.. ఓ మహిళ తనపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నటేష్ బాబు.. కాగా, డ్యూటీలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడి చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ఏపీఎస్ఆర్టీసీ.. గతంలోనూ ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే.. ఇక, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తెలంగా ఆర్టీసీలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. అంతేకాదు, మహిళకు వాగ్వాదాలకు, దాడులకు దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి..