NTV Telugu Site icon

Hyderabad: సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులకు వల.. మహిళ అరెస్ట్

Arrest

Arrest

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. ఆతర్వాత వారిని విటుల వద్దకు పంపుతు వ్యభిచార కూపంలోకి దింపుతోంది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read:Care Hospital: కేర్ హాస్పిటల్స్ సంచలనం.. కార్డియాక్ కేర్‌తో 68 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స!

డాకయిట్ ఆపరేషన్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు,సరూర్ నగర పోలీసులు నాగమణిని దిల్ షుఖ్ నగర్, కమల నగర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. యువతుల ఫోటోలను వాట్సప్ ద్వారా విటులకు పంపించి.. వాళ్లకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత లొకేషన్ కన్ఫర్మేషన్ తర్వాత స్వయంగా నాగమణి విటుల వద్దకు తీసుకెళ్తోంది. అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతోంది. ఉపాధి కోసం వచ్చి బలవుతున్న యువతులు, మహిళలు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.