NTV Telugu Site icon

Anubha Pandey: మదర్స్ డే రోజు మా అమ్మను కలవలేకపోయాను.. ఇండిగో విమానం రద్దుపై మహిళ మండిపాటు

New Project (10)01

New Project (10)01

ఇండిగో విమానం రద్దవడంతో మదర్స్ డే రోజు తన అమ్మను కలవలేకపోయానని.. అనుభా పాండే అనే జర్నలిస్ట్ తెలిపారు. 11వ తేదీన ఉదయం 10.40 నిమిషాల విమానానికి ఢీల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరిన ఆమెకు విమానం రద్దయిన విషయం తెలిసింది. తాను మదర్స్ డే రోజు తన తల్లిని కలిసేందుకు ఆమె ప్రణాళిక చేసుకున్నారు. అలాగే మరునాడు ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయాలను ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దాదాపు 12 గంటల పాటు విమానాశ్రయంలో గడిపన ఆమె తన చేదు అనుభవాలను పోస్టు చేశారు.
మదర్స్ డే రోజున తన తల్లిని కలిసే అవకాశం ఉన్నందున తాను మరింత బాధపడ్డానని, అయితే ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా కుదరలేదన్నారు. తాను ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలనే ఉదయం టిక్కెట్‌ బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. తన సోదరి హైదరాబాద్‌లో, తన తల్లి అయోధ్యలో ఉంటున్నారని.. ఈ కుటుంబ కలయిక కోవిడ్ తర్వాత మొదటిదని రాసుకొచ్చారు. తన మేనల్లుడి పుట్టినరోజును జరుపుకోవడానికి ఆమె కుటుంబం పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసిందని.. దానికి కూడా హాజరు కాలేకపోయానని తెలిపారు.

READ MORE: AP Elections 2024: టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు!

విమానం రద్దయిన తర్వాత నిబంధనల్లో భాగంగా ప్రయాణికులకు కావాల్సిన వసతి, ఆహారం అందించాల్సిన బాధ్యత ఆ విమాన సంస్థకు ఉంటుంది. కాని 12 గంటల సమయంలో కేవలం మూడు ఇడ్లీలు, ఒక కప్పు కాఫీ మాత్రమే ఇచ్చారని తెలిపారు. మరో విమానానికి టికెట్ దొరికిందని.. అది కూడా ఆలస్యమై సాయంత్రం 7.50 గంటలకు వచ్చిందని రాసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో, తమ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు మనీ కంట్రోల్‌కు తెలిపింది. పరిహారం కింద కొంత నగదు సైతం ఇవ్వనున్నట్లు ఇండిగో పేర్కొంది.

Show comments