Site icon NTV Telugu

Wrestlers Protest: సాక్షి మాలిక్ వీడియో స్టేట్ మెంట్.. కారణమవే..!

Sakshi

Sakshi

Wrestlers Protest: గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన చేస్తున్న వారిలో ఓ మైనర్ రెజ్లర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అందుకు సంబంధించి సాక్షి మాలిక్ ఒక వీడియో స్టేట్‌మెంట్‌ ద్వారా తెలిపింది. మైనర్ కుటుంబాన్ని బెదిరించారని అందుకే ఆమె తన స్టేట్‌మెంట్‌ను మార్చుకున్నట్లు పేర్కొంది. బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి దృవీకరణ సాక్ష్యాధారాలు లేవని.. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఫిర్యాదును రద్దు చేయాలని సిఫార్సు చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

Read Also: Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది

మరోవైపు సాక్షిమాలిక్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణం తమలో ఐక్యత లేకపోవడమేనని అన్నారు. భారత అగ్రశ్రేణి రెజ్లర్లు తమ స్వరాన్ని పెంచారని.. ముందు ముందు ఏమి చేస్తారో చూస్తారంటూ పోలీసులను ప్రస్తావిస్తూ చెప్పింది. మరోవైపు సాక్షి మాలిక్ భర్త సత్యవర్త్ కడియన్ వీడియోలో మాట్లాడుతూ.. తమ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, కేవలం రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకమని చెప్పారు. గత 10-12 ఏళ్లుగా మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఈ విషయం రెజ్లింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు తెలుసునని స్పష్టం చేశారు. ఎవరైనా గళం విప్పితే ఈ విషయం రెజ్లింగ్ ఫెడరేషన్‌కి తెలిస్తే వాళ్ళ కెరీర్ కి ప్రమాదంగా మారేదని అన్నారు.

Read Also: Air India bomb blast: ఖలిస్తానీవాదుల దుశ్చర్చ.. 1985 ఎయిరిండియా బాంబు పేలుడు నిందితుడిని కీర్తిస్తూ పోస్టర్లు..

మరోవైపు బ్రిజ్ భూషణ్ కేసులో ఢిల్లీ కోర్టు రద్దు నివేదికను జూలై 4న పరిశీలించనుంది. రెజ్లర్ల నిరసన విషయానికొస్తే, జూన్ 18న ఖాప్ మరియు ఇతర రైతు నాయకులతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై పిలుపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version