Site icon NTV Telugu

BSNL Recharge: కేవలం రూ.127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటా..!

Bsnl

Bsnl

BSNL Recharge: మిలో ఎవరైనా బీఎస్ఎన్ఎల్ (BSNL) సిమ్ కార్డును ఉపయోగిస్తుంటే.. ముఖ్యంగా రెండో సిమ్ గా ఉపయోగిస్తున్నట్లైతే తక్కువ ధరలో వార్షిక రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కేవలం రూ. 127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటాను పొందుతున్న ఈ అద్భుతమైన ప్లాన్‌ను ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్‌గా నిలుస్తుంది. గత కొన్నిరోజులుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుంచి, ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ లక్షలాది మంది వినియోగదారులకు సరసమైన టెలికాం కంపెనీగా మారింది. నిజానికి ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లకు ప్రసిద్ధి. ఇకపోతే, బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి డేటా, అపరిమిత కాలింగ్ ఇంకా రోజువారీ SMS వంటి సౌకర్యాలను చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. మరి ఆ రీఛార్జ్ లు ఏంటో ఒకసారి చూద్దామా..

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,515 ప్లాన్:

ముందుగా BSNL రూ.1,515 ప్లాన్ గురించి చూస్తే., దీనిలో మీరు ఒక సంవత్సరం అంటే పూర్తి 365 రోజులు చెల్లుబాటు పొందుతారు. అలాగే, ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. అంతే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ లేనప్పటికీ, వినియోగదారులు మొత్తం సంవత్సరంలో మొత్తం 720GB డేటాను పొందుతారు. ఈ రూ.1,515 ప్లాన్‌ను 12 నెలలుగా లెక్కిస్తే, నెలవారీ ఖర్చు కేవలం రూ.126.25 మాత్రమే అవుతుంది. అంటే దాదాపు నెలకు కేవలం రూ.127 చెల్లించడం ద్వారా మీరు ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ టెన్షన్ నుండి విముక్తి పొందవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,499 ప్లాన్:

ఇక వార్షిక ప్లాన్ లో మరో ప్లాన్ గురించి మాట్లాడుకుంటే.. దీని ధర రూ.1,499. ఇందులో మీరు 336 రోజులు అంటే దాదాపు ఒక సంవత్సరం కన్నా కొంచెం తక్కువ (11 నెలల) చెల్లుబాటు పొందుతారు. అలాగే, ఈ ప్లాన్ మొత్తం 24GB డేటాను మాత్రమే అందిస్తోంది. అయితే, ఇది మొత్తం చెల్లుబాటు వరకు ఉంటుంది. అంటే మీరు ప్రతిరోజూ కాకుండా ఒకసారి మాత్రమే డేటాను పొందుతారు. దీనితో పాటు, ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. దీనితో మీరు ప్రతిరోజూ 100 SMSల సౌకర్యాన్ని కూడా పొందుతారు.

Exit mobile version