NTV Telugu Site icon

Winter Care Tips: పెరుగుతోన్న చలి.. వ్యాధుల బారిన పడకుండా ఈ చర్యలు తీసుకోవాలి..!

Winter

Winter

Winter Care Tips: ఈ ఏడాది చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. చలి గాలులు అనేక రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి బాగా తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్‌లు మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Read Also: Telugu States CS Meeting: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ.. పెండింగ్ అంశాలపై చర్చ!

ఈ చలి గాలుల వల్ల ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్‌ లాంటి వ్యాధులు సోకే ఛాన్స్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, గొంతు నొప్పి, దగ్గు, జలుబు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఆయాసం, న్యూమోనియా లాంటి లక్షణాలు కనబడతాయని సూచించారు.

Read Also: GST Collection : జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ప్రభుత్వ ఖజనాలోకి ఎన్ని కోట్లు జమయ్యాయంటే ?

అయితే, చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఎలాంటి వైరస్‌ సోకదు.. వేరే వారికి వ్యాప్తికాకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు బయట వాతావరణాన్ని అంచనా వేసుకుని రావాలని తెలిపారు. మరీ చలి తీవ్రత అధికంగా ఉంటే ఇంట్లోనే ఉండటం మంచిది.. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ రోగాలను బాధ పడేవారు బయటకు రావొద్దన్నారు. ఇన్‌హేలర్లను వాడుతుండాలని చెప్పుకొచ్చారు.

Read Also: Karimnagar: హోటల్‌లో మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం.. అసలేం జరిగింది?

కాగా, ఈ చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు వేడివేడి ఆహారం తీసుకోవాలి.. పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను వేసుకోవాలి.. చలి గాలులు ఉన్నప్పుడు పిల్లలను బయటకు తీసుకురావొద్దు.. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం లాంటి లక్షణాలు కనబడితే.. వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలని వెల్లడించారు. ఇక, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వైరస్‌ విజృంభిస్తుంది. దీంతో శరీరంలో వైరస్‌ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

Read Also: Poli Padyami 2024: నేడు పోలి పాడ్యమి.. భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి స్నానఘట్టాలు!

ఇక, వ్యాధి నిరోధకత చలికాలంలో తక్కువగా ఉంటుంది.. కాబట్టి, మంచి పౌష్టికాహారం తీసుకోవడం ఉత్తమమైంది. ముఖ్యంగా సిట్రస్‌ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం ఈ శీతాకాలంలో తీసుకోవాలని వైద్య నిపుణులు తెలిపారు. ఎక్కువగా నీటిని తాగుతుండాలి.. కాచి చల్లార్చిన నీళ్లను తాగడం చాలా మంచింది. ఈ విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అవయవాల్లో గాయాలు ఏర్పడి మరణాలు సంభవించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Show comments