NTV Telugu Site icon

Winter Season : చలికాలంలో పండించే కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Winterseason

Winterseason

ప్రస్తుతం చలికాలం మొదలైంది.. ఈ కాలంలో కొన్ని కూరగాయలను పండించడం అనుకూలమైనది.. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి.. ఇకపోతే ఈ సీజన్ లోనే దిగుబడులు ఎక్కువగా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు..

ఈ కాలంలో చీడ, పీడలను తట్టుకొనే కూరగాయల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి బయటపడారు.. ఇక రబీలో చలి ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మధాతు పోషకాలు లోపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సూక్ష్మధాతు ఎరువులను సిద్థం చేసుకోవాలి. కూరగాయల సాగులో హైబ్రీడ్‌ విత్తనాల వల్ల దిగుబడులు పెరుగుతాయి. నాణ్యత లేని విత్తనాలు మార్కెట్‌లో ఉండే అవకాశం ఉంది.. అందుకే వింతనాలను చూసి కొనడం మంచిది.. లేకుంటే తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది..

వంగ, మిరప, టమాటలో నారు కుళ్లు తెగులు అధికంగా ఉంటుంది. దీంతో మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. ఇది నీటి ద్వారా ఇతర నారు మొక్కలకు కూడా సోకి అన్ని చనిపోతాయి. అందుకే ఎత్తైన నారుమడులు తయారు చేసుకుని నారు పెంచుకోవాలి. ఎకరంలో నాటడానికి సరి పోయే విత్తనం పెంచడానికి నాలుగు మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉన్న నారు మడులు 8 నుంచి 10 కావాలి. వీటిని భూమిపై నుంచి 15 సెం. మీటరు ఎత్తులో ఉండేలా తయారు చేయాలి.. ఇలా చెయ్యడం వల్ల వర్షాలు పడితే నీరు నిల్వ ఉండదు..

విత్తన మొలక శాతం పరీక్షించిన తర్వాతే నారుమడులు పెంచుకోవాలి. విత్తనాల్లో మొలక శాతం 70 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. గింజలను పేపర్‌లో వరుసగా ఒకదాని పక్కన మరొకటి పెట్టి పేపరు చుట్టాలి..అప్పుడు విత్తనాల మొలకను బట్టి విత్తుకోవాలి.. ఇక విత్తన శుద్ధి చెయ్యడం చాలా ముఖ్యం.. ఇది తప్పక గుర్తుంచుకోవాలి.. ఈ పంటల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం..