NTV Telugu Site icon

Winter Season : చలికాలంలో నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే..మంచిదా?

Desi Ghee 1

Desi Ghee 1

చలికాలం మనం ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్‌ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు.. ఈ కాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.. అయితే చాలా మందికి నెయ్యిని తీసుకోవాలా? వద్దా? అనే సందేహం రావడం కామన్.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో కొద్దిగా తింటే జలుబు వస్తుందనే భయం ఉండదు. మార్కెట్లో దొరికే నెయ్యిలో కల్తీలు ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఉత్తమం… అంతేకాదు నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. నిజానికి నెయ్యి తింటే ఆరోగ్యం బాగుంటుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫలితంగా అతిగా తినడం నివారించవచ్చు. బరువు కూడా అదుపులో ఉంటుంది… అంతేకాదు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది..

రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ నెయ్యి తింటే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు… అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర శక్తిని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులకు కూడా నెయ్యి ప్రభావవంతంగా పనిచేస్తుంది.. ఈ కాలంలో చర్మం పగలకుండా కాపాడుతుంది.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.