NTV Telugu Site icon

Beauty Tips : చలికాలంలో చర్మ సంరక్షణకు హోంమేడ్ ఫేస్ ప్యాక్స్

Beauty Tips

Beauty Tips

చలికాలం వచ్చిందంటే చర్మం బాగా పొడాబారిపోయి పగిలి పొట్టు పొట్టుగా మరి నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం శరీర సంరక్షణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీ చర్మం మరింత నిర్జీవంగా మారుతుంది. చలికాలంలో చర్మ సంరక్షణకు కాస్త ఓర్పు అవసరం. సమయం కేటాయించడం కూడా చాలా ముఖ్యం. పగిలిన నొప్పి, మంట, దురద తో కూడిన చర్మాన్ని నివారించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పగుళ్ల వల్ల అసహాయంగా కనిపించడమే కాదు, నలుగురిలో ఉన్నా తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి చలికాలంలో సమస్య నుంచి బయట పడడానికి సింపుల్‌ టిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలు ఫ్రూట్స్‌తో ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడం వల్ల చర్మం నిగారింపు సొంతం చేసుకోవడమే కాకుండా పగలకుండా డ్రై కాకుండా ఉంటుంది.

పాలు : ఒక టేబుల్‌ స్పూన్‌ బాదం పొడిలో రెండు టేబుల్‌ స్పూన్ల పచ్చి పాలను కలిపి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని స్మూత్ గా పొడిబారకుండా మారుస్తుంది.

నిమ్మ తేనే : ఒక నిమ్మకాయ లోని రసం తీయాలి. అందులో రెండు రెండు టేబుల్‌ స్పూన్ల,తేనే కలిపి దూదితో ముఖానికి రాసుకోవాలి. నిమ్మలో ఉండే విటమిన్‌ సీ, తేనే ఉండే యాంటీ ఇన్ఫ్లామెటరీ గుణాలు చర్మం పగలకుండా దురద పెట్టకుండా చేస్తాయి.

బొప్పాయి : బాగా పండిన బొప్పాయి గుజ్జు, అరటిపండు గుజ్జుని మిక్స్ చేసి ఒక టేబుల్ స్పూన్‌ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మానికి కావలసిన మాశ్చరైజర్‌ అందుతుంది.