Wings India 2026: సివిల్ ఏవియేషన్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా గుర్తింపు పొందిన వింగ్స్ ఇండియా 2026, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, FICCI ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల అంతర్జాతీయ ఏవియేషన్ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలు, ఎయిర్‌లైన్స్, రక్షణ రంగ నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొంటున్నారు.
ఈరోజు ఉదయం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు స్టాటిక్ డిస్ప్లే ఏరియాని ప్రారంభించారు. భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం, దేశీయ విమాన తయారీని ప్రోత్సహించడం, భవిష్యత్ విమాన ప్రయాణ అవసరాలకు దిశానిర్దేశం చేయడం ఈ ఈవెంట్ ఎజెండాగా చెప్తున్నారు.
చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్.. రూ.10,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం..!
వింగ్స్ ఇండియా 2026 అజెండాలో ముఖ్యంగా.. గ్లోబల్ CEO ఫోరం, పాలసీ రౌండ్‌టేబుల్స్, బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, స్టార్టప్ షోకేస్‌లు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవికాకుండా స్టాటిక్ అండ్ ఫ్లయింగ్ డిస్ప్లేలో ఫ్లైట్ విన్యాసాలు ఈ ఈవెంట్‌లో మెయిన్ అట్రాక్షన్స్ గా నిలుస్తున్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ కు 20కి పైగా దేశాల 3000 మంది బిజినెస్ డెలిగేట్స్, స్టేక్ హోల్డర్స్, గెస్ట్స్ లు వచ్చారు. 200 కి పైగా మేజర్ కంపెనీస్ ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి.
అంతర్జాతీయ విమాన తయారీ దిగ్గజం ఎయిర్ బస్సు తన అత్యాధునిక కమర్షియల్ విమానాలు A321neo, A220లను ప్రదర్శిస్తోంది. ఇవి తక్కువ ఫ్యూయల్ వినియోగం, అధిక ప్రయాణికుల సామర్థ్యంతో భవిష్యత్ ఎయిర్ ట్రావెల్‌కు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. బ్రెజిల్‌కు చెందిన Embraer సంస్థ.. E195-E2, E175 వంటి రీజినల్ జెట్ విమానాలను ప్రదర్శిస్తోంది. దేశీయ, ప్రాంతీయ విమాన సేవల విస్తరణకు ఇవి కీలకంగా మారనున్నాయి.
Google Photosకు AI అప్‌డేట్.. వాయిస్ కమాండ్లతో ఫోటో ఎడిటింగ్
అమెరికన్ విమాన దిగ్గజం బోయింగ్.. 87 Dreamliner, 737 MAX సిరీస్ విమానాలతో పాల్గొంటోంది. దీర్ఘదూర ప్రయాణాలు, అంతర్జాతీయ రూట్ల విస్తరణలో వీటి పాత్ర కీలకంగా ఉంటుంది. ఇక హెలికాప్టర్ విభాగంలో.. Airbus H160, H125 మోడళ్లను ప్రదర్శిస్తోంది. ఇవి ఎమర్జెన్సీ సర్వీసులు, హెలికాప్టర్ ట్రాన్స్‌పోర్ట్, ఆయిల్ & గ్యాస్ కార్యకలాపాలకు ఉపయోగపడనున్నాయి. బిజినెస్ జెట్ విభాగంలో.. Dassault Falcon 6X, Pilatus PC-24 వంటి లగ్జరీ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
రీజినల్ కనెక్టివిటీపై దృష్టితో…Deutsche ఎయిర్ క్రాఫ్ట్ D328eco, Ilyushin Il-114-300, అండ్ SJ-100 వంటి విమానాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. విమానాల ప్రదర్శనతో పాటు.. డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్స్, స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ సొల్యూషన్స్‌పై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రక్షణ రంగంలో దేశీయ తయారీ శక్తిని చాటుతూ.. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రత్యేక ఫ్లయింగ్ డిస్ప్లే నిర్వహించింది. డ్రోన్ లైట్ షో కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది.
మార్క్ జెఫ్రీస్ లీడర్షిప్ లో గ్లోబల్ స్టార్స్ ఎక్రోబాటిక్ టీం తో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన సూర్య కిరణ్ టీం హెలికాప్టర్ విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. మొదటి రెండు రోజులు బిజినెస్ విసిటర్స్ కి మాత్రమే ఎంట్రీ ఇవ్వగా… చివరి రెండు రోజులు సామాన్యులకి ప్రవేశం ఇచ్చారు.. దీనికోసం బుక్ మై షో లో టికెట్స్ ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవలసి ఉంటుంది… టికెట్ ప్రైస్ 944 పెట్టినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు.
Colombia Plane Crash: కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది మృతి
ఈ ఈవెంట్ ద్వారా.. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు,కొత్త ఫ్లైట్ ఆర్డర్లు, లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం..భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్‌గా నిలుస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వందల కొత్త విమానాశ్రయాలు, కొత్త ఎయిర్ రూట్లు అందుబాటులోకి రానున్నాయి.
