తెలంగాణ ప్రజలు ఆషాడమాసంలో సంప్రదాయంలో భాగంగా బోనాల ఉత్సవాల పండగ జరుపుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ ఉండటంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మద్యం షాపులు క్లోజో చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులు అర్థరాత్రి వరకు వైన్ షాప్స్ ముందు మందు కొనుగోలు చేశారు.
Read Also: LIVE : ఆషాఢ ఆదివారం నాడు ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య బాధలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి
తెలంగాణలో మందుబాబులకు సీఎం కేసీఆర్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ, రేపు మద్యం దుకాణాలను క్లోజ్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: LIVE : ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఆయుర్దాయం పెరిగి దీర్ఘాయుష్మంతులు అవుతారు
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు, హైదరాబాద్ మహానగరంలోని కమిషనరేట్ పరిధిలో ఉన్నట్టు వంటి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, మల్కాజ్ గిరి, మహేశ్వరం జోన్లలో ఒక రోజు పాటు మద్యం దుకాణాలు క్లోజ్ చేయనున్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్, ఎల్బీనగర్ డివిజన లలో.. ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్స్ ను మూసివేస్తారని తెలిపారు. దీంతో ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలు బందు చేస్తున్నారనే విషయం తెలియడంతో మందుబాటులు ముందస్తుగా నిన్న అర్ధరాత్రి వరకు మద్యం కొనుగోలు చేశారు.
