NTV Telugu Site icon

WI vs IND: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్.. కీపర్ గా ఇషాన్ కిషన్

Wi Vs Ind

Wi Vs Ind

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇవాళ్టి( బుధవారం) నుంచి డొమినికా వేదికగా తొలి టెస్ట్ మ్యా్చ్ జరుగనుంది. ఇక విండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. టీమిండియా తరఫున ఇషాన్‌ కిషన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్‌ కీపర్‌గా ఆడనున్నాడు. తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ రిజర్వ్ బెంచ్ కు పరిమితం అయ్యాడు. చివరి సారిగా 2019లో విండీస్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత వెస్టిండీస్‌తో ​టెస్టు సిరీస్‌ ఆడుతుంది. గతేడాది భారత్‌కు కరేబియన్ టీమ్ వచ్చినప్పటికీ టెస్టు సిరీస్​ఆడలేదు.

Read Also: Rahul Gandhi: ప్రధాని అవ్వకుండా రాహుల్‌పై బీజేపీ కుట్ర.. కాంగ్రెస్ నేతలు ఫైర్

అయితే ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు ఎంపికైన జైస్వాల్.. టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో ప్రారంభమయిన మొదటి టెస్టులో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. దీంతో హిట్ మ్యాన్-యశస్వి కలిసి ఓపెనర్లుగా ఓపెనింగ్ చేయనున్నారు.

Read Also: Nitin Gadkari: బయో ఇథనాల్ అందుబాటులోకి వస్తే.. లీటర్ పెట్రోల్ రూ. 15కి పడిపోతుంది..

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న యశస్వికి.. అప్పుడు ఆడే ఛాన్స్ రాలేదు.. కానీ, ఈ సారి విండీస్ ​పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు మొదటి టెస్టులోనే ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. 2021లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన శుభమన్​గిల్.. అప్పటి నుంచి ఓపెనర్​గానే బరిలో దిగుతున్నాడు. అయితే ఈ సారి యశస్వి ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో.. గిల్​మూడో స్థానంలో ఆడనున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.