అరడజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్‌ను సిద్దం చేస్తే.. బొమ్మ వాయిదాపడింది. ఇదొచ్చి ఉంటే.. బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో.. కానీ పొంగల్ తనను ఎప్పుడు ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు ఛార్మింగ్ స్టార్. పొంగల్‌కు పిచ్చ కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. అదేమంటే ప్రతి పండుగకు పనైంది కదా ఈ పండుగకు కూడా కొడదామని వస్తున్నానంటున్నాడు.
Also Read : Exclusive : స్పిరిట్.. ‘రెబల్ స్టార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా హిట్టుగా నిలిస్తే 2017లో పొంగల్‌కు రిలీజైన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో శర్వా కూడా పండుగ ఓ సెంటిమెంట్ గా తయారయ్యింది. దీనికి తోడు కంటెంట్‌పై నమ్మకంతో ఫుల్ కాంపిటీషన్ ఉన్నా.. నెక్ట్స్ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. ఎక్స్ లవర్ సంయుక్త అండ్ ప్రజెంట్ లవర్ సాక్షి వైద్య మధ్య ఇరుకున పడే లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు శర్వా. రన్ రాజా రన్ తరహా యాక్టింగ్ స్కిల్ చూపించబోతున్నాడు హీరో. ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న మూవీతో సంక్రాంతికి సక్సెస్ టేస్ట్ చేస్తాడో లేదో వెయిట్ అండ్ వాచ్.
