NTV Telugu Site icon

Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?

Vsp

Vsp

విశాఖపట్టణం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించేందుకు వెళ్లనున్నారు. విశాఖపట్టణంలో వారాహి యాత్రను జనసేనాని రెండోరోజు ప్రారంభించనున్నారు. అయితే, నిన్న విశాఖ పట్టణంలోని జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తీవిమర్శలు గుప్పించారు.

Read Also: Rohit Sharma: నన్ను, కోహ్లీనే అడుగుతారా?.. ఏం జడేజాను అడగరేం: రోహిత్ శర్మ

అయితే, ఇవాళ విశాఖలోని రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే పవన్ పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. గతంలో కూడ రిషికొండ పర్యటనకు జనసేన చీఫ్ ప్రయత్నించారు. కానీ.. ఆ సమయంలో ఆయనకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. గత ఏడాది నవంబర్ లో పవన్ కళ్యాణ్ రిషికొండను సందర్శించారు.

Read Also: Amala Paul : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ.

వైజాగ్ కి చెందిన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. అయితే, ఈ నెల 19వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగనుంది. జిల్లాలోని ప్రజల సమస్యలపై పవన్ ఆరా తీయనున్నారు. వారాహి తొలి, మలి విడత యాత్రలు ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగాయి. మూడో విడతను విశాఖ జిల్లాలో జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్టణం జిల్లాలో కూడా వైసీపీకి ఒక్క సీటు కూడ దక్కకుండా చేయాలనే వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహ రచన చేస్తున్నారు.

Show comments