NTV Telugu Site icon

Indian Hockey Team: 44 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించబోతుందా..?

India Hockey Team

India Hockey Team

బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో మంగళవారం జర్మనీతో తలపడనుంది. కాగా.. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక పోరులో భారత జట్టు జర్మనీని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని భారత జట్టు చూస్తుంది.

Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?

భారత్‌ పతకం సాధించడానికి ఇదొక మంచి అవకాశం. గతంలో టోక్యోలో టీమిండియా స్వర్ణాన్ని తృటిలో కోల్పోయింది. అయితే ఈసారి హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు ఛాంపియన్‌గా మారాలని చూస్తుంది. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్ లో భారత్ చివరిసారిగా బంగారు పతకం గెలిచింది. ఇప్పుడు పారిస్‌లో 44 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.

IND vs SL: ఓటమి నుండి టీమిండియా కోలుకుంటుందా.? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..

భారత్-జర్మనీ రికార్డు ఎలా ఉంది?
ప్రపంచ ర్యాంకింగ్స్‌, రికార్డులు ఒకదానికొకటి చూస్తే.. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌కి, నాలుగుసార్లు ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత జర్మనీకి-భారత్‌కు పెద్దగా తేడా లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీ నాలుగో స్థానంలో ఉండగా.. భారత్ ఐదో స్థానంలో ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో అర్జెంటీనాను ఓడించిన జర్మనీ, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత్‌తో తలపడగా.. ఇందులో భారత్ 5-4తో విజయం సాధించింది. ఒలింపిక్స్‌కు ముందు జర్మనీతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడి ఆరింటికి ఐదు గెలిచింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ లండన్ లెగ్‌లో భారత్ 3-0తో జర్మనీని ఓడించింది. జర్మనీపై భారత్ మెరుగైన రికార్డును కలిగి ఉంది. 18 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించింది.