NTV Telugu Site icon

Kerala Governor Challenge: స్మగ్లింగ్‌కు ముఖ్యమంత్రి అండ.. నిరూపిస్తే రాజీనామా చేస్తారా..

Kerala Governor

Kerala Governor

Kerala Governor Challenge: విశ్వవిద్యాలయాల వీసీల నియమకాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. యూనివర్శిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామాకు సిద్ధమని సవాల్‌ చేశారు. లేని పక్షంలో సీఎం రాజీనామా చేయగలరా అంటూ బహిరంగంగా సవాల్‌ విసిరారు. రాజకీయ జోక్యం అంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇటీవల వీసీల రాజీనామాలపై ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయుకాలుష్యం.. రంగంలోకి సర్కారు

సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్‌ కుంభకోణంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయమే రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సర్కారు, ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రికి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయన్నారు. ఇదంతా తాను గమనిస్తూనే ఉన్నానన్నారు. దీనిపై పుస్తకాలు కూడా వెలువడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు తమ బంధువులను ఎటువంటి అర్హత లేకున్నా నియమించుకోవాలని వీసీని ఆదేశించినట్లు గవర్నర్‌ ఆరోపించారు. తన అధికారాన్ని ఉపయోగించి ఆర్‌ఎస్‌ఎస్‌కే కాదు, ఏ వ్యక్తినైనా, నామినేట్ చేసి ఉంటే దాన్ని నిరూపించండి రాజీనామా చేస్తాను.. లేదంటే మీరైనా రాజీనామా చేయండి అంటూ ముఖ్యమంత్రికి గవర్నర్‌ సవాల్‌ విసిరారు.

Show comments