ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్ కు అంతా రెడీ అయింది. లక్నో సూపర్ జెయింట్స్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం జోరు మీదున్న లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కొంచెం తడబడిన పంజాబ్ ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ వారం అంతా విజిటింగ్ టీమ్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో పంజాబ్ గెలిచే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైల్ మేయర్స్ స్థానంలో సఫారీ ప్లేయర్ డికాక్ ను ఆడించడానికి మరో ఆప్షన్ లేదు. కైల్ మేయర్స్ తొలి రెండు మ్యాచ్ ల్లో రాణించినా.. చివరి రెండు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమైనాడు.
Read Also : Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?
ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఓపెనర్ గా వస్తున్న కొత్త కుర్రాడు ప్రభ్ సిమ్రాన్ సింగ్ వరుసగా రెండు డకౌట్ లు అయ్యాడు. కానీ అతనికీ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే లియామ్ లివింగ్ స్టోన్ ఇంకా పూర్తి ఫిట్ గా లేకపోవడంతో.. సికిందర్ రజాను కొనసాగించే ఛాన్స్ ఉంది. భానుక రాజపక్స పూర్తి ఫిట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.. అలాంటప్పుడు అతన్ని కొనసాగిస్తారా లేక వేరే వాళ్లకు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి.. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లక్నో పిచ్ పై నాథన్ ఎల్లీస్ రాణించే అవకాశం ఉంది. కానీ తమ జట్టులో రబాడ ఉండేలా పంజాబ్ కింగ్స్ ప్లాన్ చేస్తోంది. అప్పుడు ఎల్లీస్ ఆడటం కుదరదు. మాట్ షార్ట్ కూడా మూడో స్థానంలో రాణించాడు. కాబట్టి అతన్నీ తీసేయడం కూడా జరిగేలా లేదు.
Read Also : NTR: రాసి పెట్టుకోండి.. ఎన్టీఆర్ కెరీర్లో అసలు సిసలైన సినిమా ఇదే!
దీన్ని బట్టి చూస్తే లక్నోతో మ్యాచ్ లో పంజాబ్ దాదాపుగా పాత టీమ్ తోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం మేయర్స్ స్థానంలో డీకాక్ తో ఆడే అవకాశం కనిపిస్తోది. అలాగే పెద్దగా ప్రభావం చూపని జయదేవ్ ఉనద్కత్ స్థానంలో యష్ ఠాకూర్ ను ఆడించొచ్చు అనే టాక్ వినిపిస్తోంది.
Read Also : TTD Governing Body: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
తుది జట్ల అంచనా :
లక్నో సూపర్ కింగ్స్ : కేఎల్ రాహుల్( కెప్టెన్ )క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినీస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, ఆవేష్ ఖాన్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.
పంజాబ్ కింగ్స్ : ప్రభ్ సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ ( కెప్టెన్ ), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, శామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహార్, కగిసో రబాడ, అర్షదీప్ సింగ్.