NTV Telugu Site icon

IPL 2024 Orange Cap: ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి దక్కేనా..?

Kohli, Ruthu.

Kohli, Ruthu.

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కోసం పలువురు క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఐపీఎల్ అంటేనే ఊహించనిది.. అప్పటి దాకా ఎలాంటి ఫామ్ లో లేని బ్యార్లు సైతం బౌలర్లను వణికిస్తుంటారు. ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాగా.. మొదటి నుంచి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీకి సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ నుంచి ముప్పు పొంచి ఉంది. మే 5న జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత ఆరెంజ్ క్యాప్ లిస్టు చేంజ్ అయ్యింది. కేకేఆర్ అల్ రౌండర్ సునిల్ నరైన్.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో మూడో స్థానానికి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ లలో 180.66 స్ట్రైక్ రేట్ తో 461 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఒక సెంచరీతో పాటు మూడు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ, రుతురాజ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. మరో కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కూడా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో 429 రన్స్ చేశాడు. ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగులు సాధించిన అతడు 431 రన్లకు చేరుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ ఇప్పటికే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దగ్గరే ఉంది. అతడు ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో 542 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ నుంచి అతనికి గట్టి పోటీ ఉంది. రుతురాజ్ ప్రస్తుతం కోహ్లి కంటే కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. చివరికి క్యాప్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

READ MORE: Akshay Kumar : “కన్నప్ప” మూవీ కోసం అక్షయ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ ముంబై బౌలర్ బుమ్రా దగ్గరే ఉంది. అతడు 11 మ్యాచ్ లలో 17 వికెట్లతో ఉన్నాడు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. లక్నోపై మూడు వికెట్లు తీసిన వరుణ్.. ప్రస్తుతం 11 మ్యాచ్ లలో 16 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇక మరో బౌలర్ సునీల్ నరైన్ కూడా 11 మ్యాచ్ లలో 14 వికెట్లు తీశాడు. నరైన్ ఆరో స్థానంలో ఉన్నాడు. సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్, పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెరో 15 వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఎవరు సొంతం చేసుకుంటారో చివరి వరకు వేచి చూడాల్సిందే.