Site icon NTV Telugu

Rahul Gandhi: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గాంధీ..?

Rahul Gandhi

Rahul Gandhi

దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే 3 దశ పోలింగ్ అయిపోగా, ఈరోజు నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు.. మిగత దశల ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అగ్రనేత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాగా.. తన నామినేషన్ తర్వాత మొదటిసారిగా రాయ్‌బరేలీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Mahesh Babu: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన మహేశ్‌ బాబు, రామ్‌చరణ్

రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. కాగా.. రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు.

Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్‌.. ఈసీ ప్రత్యేక దృష్టి..

మరోవైపు.. తన ప్రసంగాన్ని ముగించే ముందు తన సోదరి ప్రియాంక గాంధీని వేదిక ముందుకి పిలిచారు. ఆమె భుజాలపై చేయి వేసి.. ఆమె ముఖాన్ని ఆప్యాయంగా తాకి, రాయ్‌బరేలీలో ఆయన తరుఫున ప్రచారం చేస్తున్న కృషికి రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, తమ సోదరి ఇక్కడే గడుపుతున్నారని, ఇందుకు ఆమెకు చాలా కృతజ్ఞతలు అని తెలిపారు.

Exit mobile version