NTV Telugu Site icon

Kalki 2898 AD: దీపికా పదుకోన్ తెలుగులో మాట్లాడనుందా?

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone to dub in Telugu for Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీలతో పాటు విలక్షణ నటుడు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న కల్కి 2898 ఏడీ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటికొచ్చింది.

కల్కి 2898 ఏడీ సినిమాలో పద్మ అనే పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలోని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని దీపిక అనుకుంటున్నారట. సొంత డబ్బింగ్‌ అయితే తన పాత్రకు మరింత న్యాయం చేయగలని దీపిక భావిస్తున్నారట. త్వరలోనే దీపిక వాయిస్‌కు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ ప్రాథమిక డబ్బింగ్‌ టెస్ట్‌ నిర్వహించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారట. ప్రస్తుతం దీపిక తెలుగు నేర్చుకుంటుందట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. దీపికా తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్‌ సినిమా ఇదే.

Also Read: Sunaina Ice Meditation: ఐస్‌బాత్‌ చేసిన తెలుగు హీరోయిన్‌ సునైనా.. వీడియో వైరల్!

కల్కి 2898 ఏడీ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని తెలిసింది. ప్రభాస్, దిశా పటానీలపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. సుందరమైన లొకేషన్లలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారని, విజువల్స్‌ బాగుంటాయని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహాభారత కాలంలో మొదలై 2898 కాలంలో ఈ చిత్ర కథ ముగుస్తుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇటీవల కథ గురించి తెలిపారు.