NTV Telugu Site icon

Modern Woman: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వాడొద్ధన్నందుకు భర్తను వదిలేసిన భార్య

Facebook Instagram

Facebook Instagram

Modern Woman: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని వల్ల లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎక్కడైన చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది టీవీలో వచ్చేంతవరకు ప్రపంచానికి తెలియదు. ఇంటర్నెట్ వాడకం విరివిగా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటికి జనం బాగా అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే వాటి వ్యామోహంలో కూరుకుపోయారు. ఇప్పుడు ఇవే ఓ కొత్త జంట కాపురంలో చిచ్చు పెట్టాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడొద్దు అన్నందుకు బిహార్‌లో ఓ మహిళ కట్టుకున్న భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

Read Also:Anasuya : అను ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని హాజీపూర్‌లో కొత్తగా పెళ్లయిన జంట ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడిపోయింది. సోషల్ మీడియా గొడవతో ఓ మహిళ భర్తను వదిలేసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరిద్దరూ 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే ఇలా విడిపోవాల్సి వచ్చింది. అంతే కాదు ఆ మహిళ తన సోదరుడిని రెచ్చగొట్టి భర్తపైకి గొడవకు పంపింది. ఆ వ్యక్తి తుపాకీతో వచ్చి మరీ బావను చంపుతానంటూ బెదిరించాడు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది.

Read Also:Cooler Auto: వాట్ ఏన్ ఐడియా సర్ జీ.. ఆటోకు కూలర్ సూపర్

కొత్తగా వచ్చిన కోడలు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా గంటల తరబడి ఫోన్ లోనే కూర్చుంటుందని అత్తమామలు వాపోయారు. ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లకు అడిక్ట్ అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై భార్య, భర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. మహిళ ఇంట్లో చెప్పడంతో వారు వచ్చి దాడి చేయడంతో వివాదం కాస్త ముదిరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి గొడవను పరిశీలించారు. నవ వధువు సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే… బాలిక తరపున బంధువులు తమ వాదనలు వినిపించారు. అత్తమామలు తమ కూతురు ఫోన్‌ను తీసుకెళ్లారని, తమతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం కొంత సద్దుమణిగింది. అత్తమామలతో ఉండేందుకు అమ్మాయి అంగీకరించలేదు. అంతే కాదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడకుండా ఉండలేనని తేల్చి చెప్పింది. రాజీ పడలేక… బాలిక తల్లి వద్దకు వెళ్లింది.

Show comments