NTV Telugu Site icon

Karnataka: ఇద్దరు పిల్లలు.. కట్ చేస్తే హిజ్రాగా మారాడు! విషయం తెలిసి మూర్ఛపోయిన భార్య

Pawan Kalyan

Pawan Kalyan

Missing man found living as Transgender in Karnataka: అతడికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ కుటుంబంను వదిలి పారిపోయాడు.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.. కట్ చేస్తే హిజ్రాగా మారిన భర్తను చూసి భార్య మూర్ఛపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగరలో చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన కేసు పరిష్కారం కావడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావుకు 2015లో వివాహం అయింది. రెండేళ్లలో అతడి భార్య ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ఓ చికెన్ సెంటర్‌లో పని చేసే లక్ష్మణరావు.. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ 2017లో ఇల్లు వదిలి పోయాడు. తన భర్త ఇంటికి రాకపోవడంతో లక్ష్మణరావు భార్య ఐజూరు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంత వెతికినా.. లక్ష్మణరావు ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రుల సహకారంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తోంది. ఇటీవల కన్నడ బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన వీడియోలను టీవీలో చూస్తున్న సమయంలో లక్ష్మణరావు భార్యకు ఒక వ్యక్తిని చూసి అనుమానం వచ్చింది. వీడియోలను ఫోన్లో పరిశీలించగా.. తన భర్త రూపంలోనే ఓ హిజ్రా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఐజూరు పోలీసులకు ఆమె విషయం చెప్పింది.

Also Read: IND vs ENG: విశాఖ టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! రజత్‌ పటీదార్‌ అరంగేట్రం

కన్నడ బిగ్‌బాస్‌ షోలో నీతు వనజాక్షి అనే హిజ్రా పాల్గొంది. ఎలిమినేట్ అయ్యాక ఆమెకు మైసూరులో హిజ్రా సంఘం స్వాగతం పలికింది. రష్మిక అనే హిజ్రా తీసిన రీల్స్‌లో లక్ష్మణరావును పోలిన ఓ హిజ్రా ఉంది. ఆ వీడియో ద్వారా ఐజూరు పోలీసులు రష్మికను సంప్రదించి.. వీడియోలో కనిపించిన వ్యక్తి సమాచారం తెలుసుకున్నారు. ఆమె పేరు విజయలక్ష్మి అని రష్మిక తెలిపింది. అడ్రెస్ తెలుసుకున్న పోలీసులు విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాను లక్ష్మణరావును కాదని.. విజయలక్ష్మిని అని వాదించాడు. విజయలక్ష్మి ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు, ఇతర చిహ్నాలను భార్య గుర్తు పట్టింది. దాంతో తానే లక్ష్మణరావును అని, లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పాడు. ఆ మాటలు విన్న భార్య మూర్ఛపోయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. తనకు కుటుంబం కన్నా.. హిజ్రా జీవితమే బాగుందని లక్ష్మణరావు అలియాస్ విజయలక్ష్మి చెప్పాడు.