Site icon NTV Telugu

Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య

Puducherry : మహిళలపై వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అదే సమయంలో భార్యలు భర్తలను అంతం చేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే పుదుచ్చేరిలో జరిగింది. విల్లుపురం జిల్లాలోని రెడ్డివనంకు చెందిన సేదుపతి (23) పంచర్ లు వేస్తూ జీవనం సాగించేవాడు. అతడు 2019లో అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మురుగవేణిని ప్రేమించాడు. 2019లో వారికి వివాహం జరిగింది. వీరిద్దరు ఓ గుడిసెలో కాపురం పెట్టారు. అయితే పెళ్లయిన నాటి నుంచి సేదుపతి తాగి వచ్చి భార్యను తీవ్రంగా కొట్టేవాడు.

Read Also: Chiru: మెగాస్టార్ కి ఒటీటీ ఆఫర్? నో చెప్పడానికి కారణం అతనేనా?

తరచూ ఇలాగే జరగుతుండటంతో మురుగవేణికి విసుగు వచ్చింది. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 2019 ఆగస్టు 1వ తేదీన ఇంట్లో సేదుపతి నిద్రిస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన భార్య.. అతడిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. అయితే అందరూ గుడిసెకు నిప్పు అంటుకోవడంతో అతడు మరణించాడని అనుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో మురుగవేణి తన నేరాన్ని అంగీకరించింది. తరచూ మద్యం తాగి వేధించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి దిండివనం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు. అప్పటి నుంచి అక్కడే విచారణ జరిగింది. కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి మురుగవేణి శిక్ష ఖరారు చేశారు. రూ.5 వేల ఫైన్, యావజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.

Read Also:New secretariat: సెక్రటేరియట్ కట్టడానికి వాడిన మెటీరియల్.. అంతస్తుల వారీగా వివరాలు

Exit mobile version