Wife Kills Husband: భర్త తనను లైంగికంగా సంతృప్తి పరచలేదనే కారణంతో భార్య దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్ (29) భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని జూలై 20వ తేదీ సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో నిహాల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఇర్ఫాన్‌ను ఫర్జానా ఖాన్ తీసుకొచ్చింది. ఇర్ఫాన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శరీరంపై గాయాలు గమనించిన ఆసుపత్రి బృందం వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
READ MORE: HHVM : ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట.. వీరమల్లు భారీ స్కెచ్..
ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫర్జానాను విచారించగా.. తన భర్త తనను తాను పొడిచుకుని చనిపోయాడని ఆమె ఆరోపించింది. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో ఆ గాయాలు ఇర్ఫాన్ చేసుకున్నవి కాకపోవచ్చని తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమె మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ మహిళ ఇంటర్నెట్ లో హిస్టరీ డిలీట్ చేసినట్లు గుర్తించారు. అల్యూమినియం ఫాస్ఫైడ్ (సాధారణంగా ‘సల్ఫోస్’ అని పిలుస్తారు) వంటి విషపూరిత పదార్థాల ఉపయోగం, దాని ప్రభావాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తేలింది. దీంతో ఫర్జానాను పోలీసులు వారి స్టైల్‌లో విచారించగా.. నేరాన్ని అంగీకరించింది.
READ MORE: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..
భర్త శారీరక సంబంధం పట్ల అసంతృప్తి చెంది అతన్ని చంపాలని నిర్ణయించుకున్నానని పోలీసులకు చెప్పింది. షాహిద్ ఛాతీపై మూడుసార్లు కత్తితో పొడిచి, ఆపై తానే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి, పోలీసులను తప్పుదారి పట్టించడానికి ఆత్మహత్య కథను అల్లిందని తేలింది. నిందితురాలి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎవరితో చాట్ చేసిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫర్జానా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.
