Site icon NTV Telugu

Tragedy : సగటు భార్యలా ఉంది… కానీ కాదు.. ఆమె ఆటలో భర్త ప్రాణం బలి..!

Crime

Crime

Tragedy : మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని షమ్నాపూర్ గ్రామంలో ఒక పాశవిక హత్య కేసు వెలుగు చూసింది. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఓ భార్య చివరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు ఒప్పుకుని షాక్‌కు గురి చేసింది. స్థానికంగా అందరినీ కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటనలో, లత అనే మహిళ తన భర్త శ్రీను ప్రయాణాన్ని ముగించడానికి మల్లేష్ అనే ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధాన్ని భర్త గమనించి వారిని హెచ్చరించగా, లత తన ప్రియుడితో కలిసి భర్తను మాయం చేయాలని నిర్ణయించుకుంది.

Samantha : సమంత, రాజ్ క్లోజ్ ఫోటో.. రియాక్ట్ అయిన వైఫ్ శ్యామాలి

లత తన ప్రియుడి మల్లేష్‌తో కలిసి, మోహన్ అనే మరో వ్యక్తికి రూ. 50 వేల సుపారి ఇచ్చింది. ఈ మేరకు, గత నెల 16న శ్రీనును మద్యం సేవిద్దామని ఒప్పించి అనంతసాగర్ గ్రామ శివారులకు తీసుకెళ్లారు. అక్కడ బీరు సీసాతో తలపై బలంగా కొట్టి శ్రీనును హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. గత నెల 28న లత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే విచారణలో అనుమానాస్పదంగా వ్యవహరించిన ఆమెను పోలీసులు గట్టిగా విచారించగా, చివరకు లత , మల్లేష్ తమ కుట్రను అంగీకరించారు. ఈ హత్యలో పాల్గొన్న మోహన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఒక మహిళ కేవలం ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిందనే వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Lizard In Ice cream: ఐస్ క్రీంలో బల్లి తోక.. దుకాణం సీజ్, కంపెనీకి రూ.50,000 జరిమానా..!

Exit mobile version