Illegal Affair : ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన బచ్రావాన్ పోలీస్ స్టేషన్‌లోని తులేహండి గ్రామంలో జరిగింది. మార్చి 30న రాజేష్ తన భార్య తన ప్రేమికుడు నన్హు మహతాబ్‌తో కలిసి మద్యం సేవించాడు. రాజేష్ బాగా తాగి నిద్రపోయాడు. ఆ తర్వాత భార్య, ప్రియుడి మధ్య గొడవ మొదలైంది. అరుపులు వినిపిస్తుండడంతో రాజేష్ కు మెలకువ వచ్చింది. ఆ సమయంలో అతను తన భార్యను అభ్యంతరకరమైన స్థితిలో చూసి కోపగించాడు. ఆ క్రమంలో రాజేష్ ఇద్దరితో ప్రతిఘటించడంతో వారు అతడిని హత్య చేశారు. రాజేష్ హత్య కేసును పోలీసులు బయటపెట్టారు. అతని భార్య తన ప్రేమికుడితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు ఆ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తకు మద్యం తాగించింది. ఆ తర్వాత భర్త నిద్రలోకి జారుకోవడంతో ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు.
Read Also: Murder: ఇంటికి రమ్మని భార్య ప్రియుడికి భర్త ఫోన్.. నమ్మి రాగానే నరికేశారు
ఈ కేసులో రాయ్‌బరేలీ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవీన్ సింగ్ మాట్లాడుతూ రాజేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బచ్రావ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని తెలిపారు. దీనిపై బృందం చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు. అయితే, నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేకపోవడంతో.. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు వేచి చూశారు. నివేదిక అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేసి మృతుడి బంధువులను విచారించారు. ఆ సమయంలోనే గ్రామానికి చెందిన నన్హు మహతాబ్‌తో అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మహిళను పోలీసులు తమ స్టైల్లో విచారించగా.. ఘటన జరిగిన రోజు రాజేష్, అతని భార్య రేష్మ, మెహతాబ్ మద్యం సేవించినట్లు తేలింది. రాజేష్ మద్యం మత్తులో నిద్రపోయాడు. లేచి చూసేసరికి తన భార్య, మెహతాబ్‌ను అభ్యంతరకర స్థితిలో చూసి ఆగ్రహించాడు. ఈలోగా భార్య తన ప్రియుడితో కలిసి అతడి గొంతు కోసి హత్య చేసింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ విషయంలో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.
