Illicit Relationship: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. దౌలత్‌పురాలో ఆటో గడుపుతూ జీవనం కొనసాగిస్తున్న భర్త మనోజ్.. భార్య రాధ మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా.. అదే ప్రాంతంలో నివాసముంటున్న లారీ డ్రైవర్ రాజేష్ అనే వ్యక్తి వీరి మధ్య గొడవలను ఆపేసేవాడు. దీంతో.. రాధ, రాజేష్ మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. అయితే.. ఈ విషయం భర్త మనోజ్ తెలుసుకున్నాడు. వారి మధ్య బంధాన్ని మనోజ్ వ్యతిరేకిస్తూ.. గొడవలు పెట్టేవాడు. ఈ క్రమంలో.. తమ ప్రేమకు మనోజ్ అడ్డుగా వస్తున్నాడని, రాధ తన ప్రేమికుడు రాజేష్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. కుట్రలో భాగంగా ఏప్రిల్ 7న మనోజ్‌ని లాల్కువాన్‌లోని రాజేష్ వద్దకు పంపించి డబ్బులు తీసుకురావాలని కోరింది.
Also Read
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
GT vs RR: గుజరాత్ టార్గెట్ 197.. రాణించిన పరాగ్, శాంసన్
ఈ క్రమంలో.. రాజేష్ మనోజ్‌ని తన లారీలో కూర్చోబెట్టి దాద్రి వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో అతనికి మద్యం ఇచ్చాడు.. ఆ తర్వాత మద్యం మత్తులోకి చేరుకోగానే బట్టలు విప్పి, ఆపై తాడుతో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ట్రక్కు క్యాబిన్‌లోనే దాచాడు. మరుసటి రోజు తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జహాన్ దాస్నా వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.
హత్య జరిగిన విషయాన్ని రాధకు తెలియజేసిన ప్రియుడు.. తన భర్త తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. దీంతో.. ఏప్రిల్ 9న రాధ సిహాని గేట్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కాగా.. పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఏప్రిల్ 8న దాద్రీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిసి.. ఆ మృతదేహం ఫొటోను అలీఘర్‌లోని అత్రౌలీలో నివసిస్తున్న మనోజ్ తండ్రి రాంఖిలాడికి చూపించారు. అతను తన కొడుకుగా గుర్తించాడు.
Yarlagadda Venkata Rao: టీడీపీలోకి చేరిన 35 ఎస్సీ కుటుంబాలు, 5 ముస్లిం కుటుంబాలు..!
కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు సూత్రధారి తన భార్య రాధే అని తెలుసుకున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు బుధవారం రాధతో పాటు ప్రియుడు రాజేష్ ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు రాజేష్ నుంచి లారీ క్యాబిన్‌లో మనోజ్ మొబైల్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డు, హత్యకు ఉపయోగించిన తాడు, మృతదేహాన్ని దాచేందుకు ఉపయోగించిన దుప్పటి, మృతుడి చెప్పులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!