NTV Telugu Site icon

Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య

Wife Did Not Cook Chicken Husband Committed Suicide In Up

Wife Did Not Cook Chicken Husband Committed Suicide In Up

Chicken : ఈ మధ్య కాలంలో చావంటే చాలా ఈజీ అయిపోయింది. జనాలకు కొంచెం కూడా ఓపిక, ఆలోచన లేకుండా అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య చికెన్ వండమంటే వండలేదని ఓ భర్త మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్‌నగర్‌లో గురువారం రాత్రి ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పవన్, ప్రియాంక అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. పవన్ తాగే అలవాటు ఉంది. ఈ విషయం మీద తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బాగా తాగి వచ్చి పవన్.. తన భార్య ప్రియాంకను చికెన్ వండమన్నాడు. ఎందుకు తాగి వచ్చావు.. నేను వండనంటూ ఆమె నిరాకరించింది. దీంతో భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పవన్ ఫర్నీచర్ షాపులో పనిచేసేవాడు. ప్రియాంకతో పవన్ కు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది.

Read Also:New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

గురువారం, పవన్ తన కోసం చికెన్ వండమని తన భార్యను కోరగా, దానికి ప్రియాంక నిరాకరించింది, అప్పటికే రాత్రికోసం వంట చేసేశానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయింది. అది కాస్తా శారీరక హింసగా మారి.. చివరకు పవన్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ సమయంలో ప్రియాంక వేరే గదిలో నిద్రిస్తుంది. కొన్ని గంటల తర్వాత మృతుడి సోదరుడు వచ్చి చూడగా పవన్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి ఇంటి తలుపులు ఎన్నిసార్లు కొట్టినా ఎవరూ సమాధానం చెప్పలేదని పవన్ సోదరుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత తన కూతురిని కిటికీలోంచి గదిలోకి చూడమని అడిగాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ పవన్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.