NTV Telugu Site icon

Viral News : భర్తకు గుడి కట్టించిన భార్య.. ప్రత్యేక పూజలు కూడా..

Mahboobad

Mahboobad

భారతీయ వివాహ బంధం చాలా గొప్పది.. పెళ్లికి ముందు ఒకరికి ఒకరు తెలియక పోయిన కూడా పెళ్లి తర్వాత ఒకరి కోసం మరొకరుగా బ్రతుకుతుంటారు.. ప్రేమ, ఒకరిపై మరొకరి నమ్మకం ఉంటే ఆ బంధం జీవితాంతం హాయిగా సాగుతుంది.. కొందరు మాత్రం మూర్ఖత్వంతో బందాన్ని ముక్కలు చేసుకుంటారు. మరికొందరు మాత్రం చనిపోయే వరకు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు కదా.. అందుకు ఒక కారణం కూడా ఉంది..

ఈ మధ్య భార్య చనిపోతే ఆమె గుర్తుగా గుడి కట్టిస్తున్న ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.. అలాగే భర్త చనిపోతే ఆయన జ్ఞాపకాలను గుర్తుగా ఉంచుకొనేందుకు భార్య గుడి కట్టిస్తున్నారు.. తాజాగా తెలంగాణాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త తనతో లేడన్న విషయాన్ని భరించలేక తన గుర్తుగా గుడిని కట్టించింది.. ఈ రోజూ ఆ గుడిని ప్రారంభించింది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో వెలుగు చూసింది. జిల్లాలోని పర్వతగిరి శివారు సోమ్లా తండాలో కళ్యాణి అనే మహిళ భర్త జ్ఞాపకార్థం గుడి కట్టించింది.. ఆమె భర్త కొన్ని రోజుల క్రితం మరణించారు.. ఆయన గుర్తుగా గుడి కట్టించింది.. ఆ గుడిలో ప్రతి మూలన తన భర్త జ్ఞాపకాలు ఉండేలా ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించి, ప్రతిష్ట చేసింది.. ఈరోజు గుడిని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసింది.. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది..