Site icon NTV Telugu

WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!

Wi Vs Zimbabwe

Wi Vs Zimbabwe

WI vs Zimbabwe: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేశారు.

T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?

వెస్టిండీస్ బ్యాటింగ్‌లో హెట్మేయర్ కేవలం 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి 250 స్ట్రైక్‌రేట్‌తో 85 పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అతనికి తోడుగా రోవ్మాన్ పావెల్ కూడా 35 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో రూథర్ఫోర్డ్ (31*), రోమారియో షెఫర్డ్ (21), జాసన్ హోల్డర్ (13) వేగంగా పరుగులు చేసి స్కోరును 250 దాటించారు.

2026 లో రాబోయే Top Cars ఇవే.. అందరూ ఎదురుచూస్తున్న ఆ SUV వచ్చేస్తోంది.!

వెస్టిండీస్ చివరి 5 ఓవర్లలోనే 75 పరుగులు సాధించడంతో భారీ స్కోర్ ను అందుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజారాబని చెరో రెండు వికెట్లు తీసినా, విండీస్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు. చూడాలిమరి విండిస్ బౌలర్లను జింబాబ్వే బ్యాటర్లు ఎంతవరకు ఎదురుకోగలరో.

Exit mobile version