Hardik Pandya React on India Defeat against West Indies in 2nd T20I: వెస్టిండీస్‌పై తొలి టీ20లో ఓడిన భారత్.. రెండో టీ20లోనూ ఓటమిని ఎదుర్కొంది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగింది. యువ ఆటగాడు తిలక్ వర్మ (51) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ (67; 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి అతిథ్య విండీస్ దూసుకువెళ్లింది. ఈ ఓటమిపై భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడని, అతడి వల్లే మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోయిందన్నాడు.
రెండో టీ20 అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ… ‘నిజాయతీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన బాగా లేదు. మేం మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కనీసం 160 ల్దా 170కి పైగా స్కోర్ చేయాల్సింది. నికోలస్ పూరన్ ఆడిన తీరు అద్భుతం. పూరన్ ఆటతో స్పిన్నర్లను రొటేట్ చేయడం కష్టంగా మారింది. కేవలం పూరన్ ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ విండీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది’ అని అన్నాడు.
‘ప్రస్తుతం ఉన్న భారత్ కాంబినేషన్‌పై నాకు నమ్మకం ఉంది. టాప్ 7 బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలి. బౌలర్లూ గెలిపిస్తారనే నమ్మకం ఉంది. జట్టు సమతూకంగా ఉందని నిరూపించుకోవడానికి మేము పలు మార్గాలను అన్వేషించాలి. ఆటగాళ్లంతా విజయం కోసం పోరాడాలి. నాలుగో స్థానంలో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ తిలక్ వర్మ రావడం మంచి ప్రయోగం. తిలక్ బ్యాటింగ్‌ను చూస్తుంటే.. అతడికి ఇది రెండో అంతర్జాతీయ మ్యాచ్‌గా అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా బాగా ఆడాడు. తప్పకుండా వచ్చే మ్యాచ్‌లో విజయం సాధిస్తాం’ అని హార్దిక్ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Hyderabad News: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. నడి రోడ్డుపైనే యువతిని వివస్త్రను చేసి..!