NTV Telugu Site icon

Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!

Shai Hope Alzarri Joseph Video

Shai Hope Alzarri Joseph Video

గల్లీ క్రికెట్‌లో ఆటగాళ్లు గొడవ పడడం చాలా కామన్. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయానికి గొడవలు జరుగుతుంటాయి. బాల్ బౌండరీ వెళ్లలేదనో, క్యాచ్ సరిగా పట్టలేదనో, బ్యాటింగ్ రాలేదనో లేదా బౌలింగ్ ఇవ్వలేదనో.. ప్లేయర్స్ అలిగి మ్యాచ్ మధ్య నుంచే మైదానం వీడుతుంటారు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌లో కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. ఓ బౌలర్ మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడాడు. ఈ ఘటన గురువారం బార్బడోస్ వేదికగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో చోటుచేసుకుంది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లోని నాలుగో ఓవర్‌ను విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ వేశాడు. ఓవర్ వేసేముందు జోసెఫ్‌ తనకు కావాల్సిన విధంగా ఫీల్డ్ సెటప్ చేయమని కెప్టెన్ షై హోప్‌కు చెప్పాడు. తనకు ఎక్కడ ఫీల్డర్లు కావాలో కూడా చెప్పాడు. అయితే జోసెఫ్ సూచించిన ఫీల్డ్ సెటప్ కాకుండా.. హోప్ మరోలా సెట్ చేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అతడు ఆ కోపాన్ని బంతిపై చూపించాడు. నాలుగో బంతిని బౌన్సర్‌గా సంధించి.. జోర్డాన్ కాక్స్ (1)‌ను అవుట్ చేశాడు. ఔట్ చేసిన తర్వాత హోప్‌పై జోసెఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: AUS vs IND: హ్యాట్రిక్‌ కొట్టనివ్వం.. టీమిండియాను నిశ్శబ్దంగా ఉంచుతాం: కమిన్స్

అల్జారీ జోసెఫ్‌ మరో రెండు బంతులేసి నాలుగో ఓవర్‌ను పూర్తి చేశాడు. కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. మైదానం వీడాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ పిలిస్తున్నా అతడు పట్టించుకోలేదు. ఓ ఓవర్ పాటు డ్రెస్సింగ్ రూమ్‌లోనే జోసెఫ్‌ కూర్చున్నాడు. డారెన్ సామీ అతడి వద్దకు వెళ్లి మాట్లాడంతో తిరిగి మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జోసెఫ్‌కు కొందరు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

Show comments