Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!
- వెస్టిండీస్-ఇంగ్లండ్ మూడో వన్డే
- హోప్‌పై జోసెఫ్ ఆగ్రహం
- మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గల్లీ క్రికెట్‌లో ఆటగాళ్లు గొడవ పడడం చాలా కామన్. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయానికి గొడవలు జరుగుతుంటాయి. బాల్ బౌండరీ వెళ్లలేదనో, క్యాచ్ సరిగా పట్టలేదనో, బ్యాటింగ్ రాలేదనో లేదా బౌలింగ్ ఇవ్వలేదనో.. ప్లేయర్స్ అలిగి మ్యాచ్ మధ్య నుంచే మైదానం వీడుతుంటారు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌లో కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. ఓ బౌలర్ మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. ఈ ఘటన గురువారం బార్బడోస్ వేదికగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లోని నాలుగో ఓవర్‌ను విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ వేశాడు. ఓవర్ వేసేముందు జోసెఫ్ తనకు కావాల్సిన విధంగా ఫీల్డ్ సెటప్ చేయమని కెప్టెన్ షై హోప్‌కు చెప్పాడు. తనకు ఎక్కడ ఫీల్డర్లు కావాలో కూడా చెప్పాడు. అయితే జోసెఫ్ సూచించిన ఫీల్డ్ సెటప్ కాకుండా.. హోప్ మరోలా సెట్ చేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అతడు ఆ కోపాన్ని బంతిపై చూపించాడు. నాలుగో బంతిని బౌన్సర్‌గా సంధించి.. జోర్డాన్ కాక్స్ (1)ను అవుట్ చేశాడు. ఔట్ చేసిన తర్వాత హోప్‌పై జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
Also Read: AUS vs IND: హ్యాట్రిక్ కొట్టనివ్వం.. టీమిండియాను నిశ్శబ్దంగా ఉంచుతాం: కమిన్స్
అల్జారీ జోసెఫ్ మరో రెండు బంతులేసి నాలుగో ఓవర్‌ను పూర్తి చేశాడు. కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. మైదానం వీడాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ పిలిస్తున్నా అతడు పట్టించుకోలేదు. ఓ ఓవర్ పాటు డ్రెస్సింగ్ రూమ్‌లోనే జోసెఫ్ కూర్చున్నాడు. డారెన్ సామీ అతడి వద్దకు వెళ్లి మాట్లాడంతో తిరిగి మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జోసెఫ్‌కు కొందరు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
Alzarri Joseph left the field in anger because he wasn’t happy with the captain’s field placement.
West Indies had only 10 fielders for an entire over, until he finally made a return on field.
Must be the first such act in International Cricket. pic.twitter.com/dtZJSxLn4X
— Cricketopia (@CricketopiaCom) November 7, 2024
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!