WI vs AUS: బాసెటెర్ వేదికగా నేడు (జూలై 25న) జరిగిన మూడవ టీ20లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆసీస్ 23 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరఫున టిమ్ డేవిడ్ చరిత్ర సృష్టించాడు. 37 బంతుల్లో వేగవంతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. విండీస్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలో 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించి ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
KINGDOM : ‘కింగ్‌డమ్’ సెన్సార్ రిపోర్ట్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. ఇక వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శై హోప్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడితోపాటు బ్రాండన్ కింగ్ కూడా 36 బంతుల్లో 62 పరుగులు చేశాడు. చివరికి విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎలిస్, మిచెల్ ఓవెన్, జాంపా చెరో వికెట్ తీశారు.
Gandikota Murder Case: మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..?
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట కొంత ఒడిదుడుకులకు గురైంది. మిచెల్ మార్ష్ (22), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (20) తక్కువ సమయంలోనే పెవిలియన్ చేరారు. అయితే 9వ ఓవర్ నాటికి 87/4 వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ మ్యాచ్‌ను ఆసీస్ వైపు మార్చేశాడు. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 11 సిక్సర్లతోనే 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడికి తోడుగా.. మిచెల్ ఓవెన్ 16 బంతుల్లో 36 పరుగులు జోడించాడు. ఈ జంట కలిసి మరో వికెట్ నష్టపోకుండా 16.1 ఓవర్లలో విజయం సాధించింది. ఇక మరోవైపు విండీస్ బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. రోమారియో షెపర్డ్ 2 వికెట్లు తీసినా, 12.3 ఎకానమీ రేట్ తో దారుణంగా విఫలమయ్యాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా టిమ్ డేవిడ్ ఎన్నికయ్యాడు.
