తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం ఆహ్వానంగా ప్రతి ఏడాది ఉగాది కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి లేకుండా పండగ పూర్తి అవ్వదు. అయితే ఉగాది పండుగనాడు చేసే పచ్చడి ఎందుకు రుచి చూడాలన్న విషయం గురించి చూస్తే..
Also Read: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
ఉగాది పండుగ రోజు ఆరు రోజులను చూడడానికి కొన్ని విధానాలు లేకపోలేదు. పండగ రోజు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగురు లాంటి ఆరు రుచులను రుచి చూడాల్సి వస్తుంది. వీటన్నిటిని కలిపి పచ్చడి రూపంలో కుటుంబ సభ్యులందరికీ తీసుకుంటారు. ఈ పచ్చడిలో ఒక్కొక్క రుచి ఒక్కొక్క అనుభూతిని ఇస్తుంది. వీటికి వేరు వేరు అర్థాలు కూడా ఉంటాయి. ఉగాది పండుగ హిందూ చంద్రమన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజు. అలా చూస్తే ఉగాది మొదటి పండుగ. ఇక షడ్రుచుల విషయాన్ని వస్తే.. వేప వల్ల చేదు రుచి చూచిస్తాము. లైఫ్ అనేది ఓ ఔషధ గుణం ఉన్న మొక్క. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇది జీవితంలో వచ్చే కష్టాలకు చేదుగా దీన్ని భావిస్తారు. ఇంకా అలాగే ఉగాది పచ్చడి లో బెల్లం కూడా ఉపయోగిస్తారు. ఇది జీవితంలో సంతోషంగా ఉండాలని తెలుపుతుంది. ఈ బెల్లం తీయగా ఉండటంవల్ల కష్టాల తర్వాత ఆనందం వస్తుందని సూచిక. అలాగే ఉగాది పచ్చడిలో మరో పదార్థం కారం. ఇది కోపాన్ని సూచిస్తుంది. ప్రతి ఒక్క మనసులో ఈ కోపం ఉంటుంది కానీ.. అది అవసరమైనప్పుడు ప్రవర్తిస్తేనే బాగుంటుంది లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: Kishan Reddy: నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండి..
పచ్చడిలోని నాలుగో రుచి ఉప్పు. ఉప్పు భయానికి సంకేతం. మన జీవితంలో ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మంచి చెడులతో పాటు కాస్త భయం కూడా ఉండాలి. లేకపోతే గుడ్డిగా వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పుల్లటి చింత పండు కూడా ఉగాది పచ్చడిలో భాగం. చింతపండు వల్ల జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సాంకేతికంగా మనిషి జీవితంలో వచ్చే అన్ని విషయాలను లేదా పరిస్థితులను తగ్గట్టుగా వాటిని స్వీకరించడం ద్వారా జీర్ణించుకోవాలని తెలుపుతుంది. ఇక మామిడి నుంచి వచ్చే వగురు ఆశ్చర్యానికి చిహ్నం. వేప బెల్లం కలిపి మామిడి రుచి చూస్తే ఎంతో బాగుంటుంది. అలాగే జీవితంలో కూడా కొన్ని ఆశ్చ్యర్యలు కలిగితేనే జీవితం మరింత ముందుకు సాగుతుంది. అందుకే మామిడికాయ ద్వారా వచ్చే వగురు రుచిని ఉగాది పచ్చడిలో కూడా కలుపుతారు.
