Suryakumar Yadav: సూర్యకుమార్ ఇంపాక్ట్ సబ్ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), ముంబై ఇండియన్స్(MI) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబై తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీమిండియా టీ20 కెప్టె్న్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ సబ్ జాబితాలో చేర్చారు. కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, రాజ్ బావా, అశ్వనీ కుమార్‌లతో పాటు ఇంపాక్ట్ సబ్ జాబితాలో సూర్యను చేర్చడం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన విషయాన్ని గుర్తు చేశారు. “టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది. సూర్యకుమార్ శారీరకంగా కొంత విశ్రాంతి కోరుకున్నారు. దయచేసి లేనిపోని కథలు సృష్టించకండి, మా క్యాంప్ అంతా చాలా సంతోషంగా ఉంది. సూర్యకు గ్రోయిన్ (Groin) భాగంలో స్వల్పంగా పట్టేసినట్లు అనిపించడంతో, ముందు జాగ్రత్తగా అతనికి మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తదుపరి మ్యాచ్‌కి మాకు ఐదు రోజుల విరామం ఉంది కాబట్టి, అతను పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది. సూర్య మాకు అత్యంత విలువైన ఆటగాడు, అందుకే అతని విషయంలో ఈ లెక్కలతో కూడిన నిర్ణయం తీసుకున్నాం” అని మహేల స్పష్టం చేశారు.
READ MORE: Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు
Also Read
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
గత సీజన్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించిన విషయం తెలిసిందే. తాజాగా సూర్యకుమార్‌ను అలాగే తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టారు. ఇక నిన్న జరిగిన ఛేజింగ్‌లో సూర్యకుమార్ కేవలం 8 బంతుల్లో 16 పరుగులు చేసి తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, ముంబైకి ఆ లోటు తెలియలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (78) మరియు ర్యాన్ రికెల్టన్‌ల రికార్డు భాగస్వామ్యం (148 పరుగులు) పిచ్‌పై విధ్వంసం సృష్టించడంతో 221 పరుగుల భారీ లక్ష్యం కూడా ముంబైకి చిన్నదిగా అనిపించింది. మరోవైపు.. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అటు ఆర్‌సీబీ తరపున విరాట్ కోహ్లీ, ఇటు ముంబై తరపున రోహిత్ శర్మ తమ పాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడం లీగ్‌కు కొత్త ఊపునిచ్చింది.
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!