Site icon NTV Telugu

Yashoda Movie: సినిమా రిలీజ్‌కి లేని అభ్యంతరం ‘యశోద’ ఓటీటీ విడుదలకు ఎందుకు!?

Yashoda

Yashoda

Yashoda Movie: సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ప్యాన్ ఇండియా మూవీ ‘యశోద’ నవంబర్ 11న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే దీనికి సివిల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ సినిమాలో ‘ఎవా’ ఆసుపత్రిని చెడుగా చూపించటమే అందుకు కారణం. దీనిని బేస్ చేసుకుని ఓటీటీ విడుదల ఆపాలని ‘ఎవా ఐవిఎఫ్’ హాస్పిటల్ యాజమాన్యం పిటిషన్ కోర్టులో పిటీషన్ వేసింది. నిమాలో ‘ఎవా హాస్పిటల్స్’ అనే పేరును ఉపయోగించారని, అది తమ హాస్పిటల్ పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తోందని వారి ఆరోపణ. దీనిపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తూ ఓటీటీ ప్రదర్శన నిలిపివేయాలని ప్రొడక్షన్ హౌస్ శ్రీదేవి మూవీస్ కి నోటీసులు జారీ చేసింది.

Keerthy Suresh: తన పూర్వీకుల ఇంట్లో సందడి చేసిన మహానటి

సరోగసీ సెంటర్ పేరుతో జరిగే అన్యాయాలకు,అకృత్యాలకు వ్యతిరేకంగా సమంత ‘యశోద’గా చేసిన పోరాటమే సినిమా. అయితే సినిమా ట్రైలర్ మొదలు, విడుదలకు ముందు ప్రచారంలోనూ ఈ విషయాలను స్పష్టంగా తెలియచేసింది సినిమా యూనిట్. అలాగే సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై చక్కటి టాక్ తో రెండు వారాల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని ‘ఎవా ఐవిఎఫ్’ యాజమాన్యం ఆల్ ఆఫ్ సడన్ గా ఓటీటీ ప్రదర్శన ఆపివేయాలని పిటిషన్ వేయటం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఈ కేసు విచారణ డిసెంబర్ 19న జరగనుంది. మరి కోర్టు తదుపరి విచారణ తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Exit mobile version