సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండే నటి కీర్తిసురేశ్‌

కన్యాకుమారి సమీపంలోని తిరుక్కురుంగుడిలో ఉన్న తన పూర్వీకుల ఇంటికి వెళ్లి సరదాగా ముచ్చటించారు

8వ శతాబ్దానికి చెందిన వైష్ణవనంబి దేవాలయాన్ని సందర్శించారు.

సంబంధిత దృశ్యాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నా పూర్వీకుల ఇంటికి రావడం, పురాతన ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

గుడి నిర్మాణపరంగా అద్భుతంగా ఉండటమేకాదు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది’’ అని పేర్కొన్నారు.

కీర్తిసురేశ్‌ షేర్‌ చేసిన దృశ్యాలపై మనసు పారేసుకున్న నటి శ్రియ ‘‘నన్నూ మా వారినీ తీసుకెళ్లండి. ఆ ప్లేస్‌ను చూడాలనుంది’’ అని కామెంట్‌ చేశారు.

ఈ ఏడాది ‘గుడ్‌లక్‌ సఖి’, ‘సాని కాయిదం’ (చిన్ని), ‘సర్కారువారి పాట’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు కీర్తి.

ప్రస్తుతం ఆమె నాని సరసన ‘దసరా’, చిరంజీవి సోదరిగా ‘భోళా శంకర్‌’లో నటిస్తున్నారు. తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నారు.