NTV Telugu Site icon

Maldives: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియా వర్సెస్ చైనా.. ఎందుకంత కీలకం..

Maldives

Maldives

Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు. ఈ చిన్న దేశం ఇప్పుడు ఆసియా శక్తులుగా ఉన్న ఇండియా, చైనాలకు కీలకంగా మారింది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా, చైనాలు పోటీ పడుతున్నాయా.? అనే విధంగా అక్కడి పరిస్థితి ఉంది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు ఈ రెండు దేశాలకు కీలకంగా మారాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం భారత్ పక్షాన ఉంది. ఈ ప్రాంత భౌగోళిక స్థితి రెండు దేశాలకు కీలకంగా మారింది.

5,21,000 మంది ప్రజలు ఉంటే అనేక ద్వీపాలతో ఏర్పడిన ఈ దేశం ఆర్థిక వ్యవస్థ మేజర్ గా పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశంలో మౌళిక సదుపాయాలను డెవలప్ చేయడానికి ఇటు భారత్, అటు చైనాలు పోటీ పడుతున్నాయి. మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం మొహమ్మద్ ‘‘ఇండియా ఫస్ట్’’ నినాదాన్ని అనుసరిస్తూ.. భారత్ వైపు ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా సోలిహ్ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

సోలిహ్ కు పోటీగా మొహమ్మద్ మయిజ్జూ ఉన్నారు. ఇతని సంకీర్ణానికి చైనా సన్నిహితంగా ఉంది. ‘ఇండియా ఔట్’ అనే నినాదంలో ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా విమానాలు, భారత సైనిక ఉనికిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. 2,80,000 ఓటర్లు ఉన్నారు. గత నెలలో బానీ సెంటర్ థింక్ ట్యాంక్ నిర్వహించిన సర్వేలో 21 శాతం మంది సోలిహ్ వైపు మొగ్గు చూపగా.. 14 శాతం మంది మయిజ్జూ వైపు ఉన్నరాు. 53 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Read Also: YV Subba Reddy: ‘జమిలి’యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!

సోలిహ్‌ వైపే ప్రజలు:

2018లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా సోలిహ్ ఘన విజయం సాధించారు. అయితే 2021లో ప్రొగ్రెసివ్ పార్టీ, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న మయిజ్జూ, రాజధాని మాలే మేయర్ పదవిని గెలుచుకుని అందర్ని ఆశ్చర్యపరిచారు. ఇది సోలిహ్ పార్టీ మాల్డీవియన్ డెమోక్రాటిక్ పార్టీకి బలమైన కోటగా ఉంది.

భారత్ విషయానికి వస్తే హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తుంది. కొన్ని శతాబ్ధాలుగా మాల్దీవులకు, ఇండియాకు సాంస్కృతిక, సన్నిహిత, భద్రతా సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో చైనా అక్కడి ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులను పెట్టింది. బెల్ట్ అండ్ రోడ్ ప్లాన్ లో భాగంగా ఇంధనం, రవాణఫా నెట్వర్కుల్లో పెట్టుబడులు పెడుతోంది చైనా.

సోలిహ్ భారతదేశాన్ని సంక్షోభ సమయాన్ని మొదటగా స్పందించే దేశంగా పేర్కొన్నారు. తమకు మద్దతు ఇచ్చే దేశంగా అభివర్ణించారు. మయిజ్జూ మాత్రం అధికారంలోకి వస్తే భారత్ ప్రభావాన్ని తగ్గిస్తానని, భారత్ మాల్దీవుల సార్వభౌమాధికారానికి ముప్పు కలిగిస్తుందని, శాశ్వత మిలిటరీ బేస్ ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఆరోపణల్ని భారత్ ఖండించింది. మాల్దీవు దళాల కోసం నావికా నౌకాశ్రయాన్ని నిర్మించడానికి సాయం చేస్తున్నామని, భారత్ వారికి శిక్షణ ఇస్తోందని చెబుతోంది. మరోవైపు చైనా మాల్దీవుల్లో పాగా వేసి ఇండియా కార్యకలాపాలపై నిఘా పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో హంబన్ టోట పోర్టును లీజుకు తీసుకుంది. అక్కడి నుంచి భారత్ పై నిఘా పెడుతోంది. ఈ విషయంపై పలుమార్లు భారత్ తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది.

Show comments