Nagarjuna : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన తన సినిమాల వేగాన్ని తగ్గించారు. ఒకప్పుడు ఒక సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు. అలాంటి నాగ్ సినిమా సినిమాకు ఈమధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. తన ఏజ్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుసగా నాలుగైదు సినిమాలను చేతిలో ఉంచుకుంటే ప్రస్తుతం నాగ్ చేతిలో సోలోగా ఒక్క సినిమా కూడా లేదు. దాని వెనక రీజన్ నాగార్జున కోరినట్లు కథలు దగ్గరకు రాకపోవడమే అని తెలుస్తుంది. ఈ ఇయర్ మొదట్లో నా సామిరంగ అంటూ సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సక్సెస్ మీట్ లో ఇక మీదట ప్రతి సంక్రాంతికి తన నుంచి అభిమానులను అలరించేందుకు ఒక సినిమా వస్తుందన్నారు నాగర్జున. ఐతే తాను అనుకున్నా కూడా సరైన కథ దొరక్క వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అసలైతే నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నికి మరో అవకాశం ఇస్తాడన్న టాక్ నడుస్తోంది. నాగార్జున కూడా ఒక హిట్ ఇచ్చాడు కాబట్టి అతడని నమ్మొచ్చని అనుకున్నాడట కానీ ఎందుకో నాగ్ మళ్లీ వెనక్కి తగ్గుతున్నాడని తెలుస్తుంది. విజయ్ బిన్ని సొంత కథతో నాగ్ తో సినిమా చేయాలని వస్తేనే నా సామిరంగ రీమేక్ కథ ఇచ్చాడని తెలుస్తోంది.
Read Also:Allu Arjun: ప్రారంభమైన అల్లు అర్జున్ విచారణ.. బన్నీపై ప్రశ్నల వర్షం
ఆ సినిమా సక్సెస్ కొట్టాక కూడా విజయ్ బిన్నీ చెప్పిన కథ గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. మరోపక్క నాగార్జున వేరే కథలు వింటున్నారు కానీ అవి అసలు అవుట్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలతో యువతను ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నించిన నాగ్ ఆ తర్వాత రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం సోలో సినిమాల కన్నా ఇతర హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాతో పాటుగా రజినీకాంత్ కూలీ సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే తన సోలో సినిమా గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.
Read Also:Barack Obama : ‘బరాక్ ఒబామా’ మెచ్చిన ఇండియన్ సినిమా ఏదంటే..?