Site icon NTV Telugu

International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు? పూర్తి డీటెయిల్స్ ఇవే!

Yoga

Yoga

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రానే వచ్చింది. ప్రపంచ దేశాలు యోగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 24 గంటల ముందే కౌంట్ డౌన్ మహాత్సవాలు జరుపుకుంటున్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. నిత్యం యోగా చేయడం వల్ల ఫిజికల్ హెల్త్ తో పాటు, మెంటల్ హెల్త్ మెరుగవుతుందని భావిస్తుంటారు. అన్ని సమస్యలకు యోగా పరిష్కారంగా చెబుతుంటారు. యోగ మన దేశ ప్రాచీన సంపద. ఋషుల కాలం నుంచి యోగా ఉంది. బాడీ, మైండ్, సోల్ ను కనెక్ట్ చేస్తుంది.

Also Read:Diamond Hundi: ఆంజనేయస్వామి ఆలయ హుండీలో ఖరీదైన వజ్రం.. అజ్ఞాత భక్తుడి లేఖ!

యోగాకు మతం లేదు. సర్వ ధర్మాలకు చెందిన ఒక ఆరోగ్య శాస్త్రం యోగా. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు . ఈ సంవత్సరం ప్రపంచం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. యోగా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి ఇంటర్నేషనల్ యోగా డేను జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆవివరాలు ఇప్పుడు చూద్దాం.

Also Read:Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా

అంతర్జాతీయ యోగా దినోత్సవం

దేశంలో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 సంవత్సరంలో జరుపుకున్నారు. దీనిని ప్రధానమంత్రి మోడీ సెప్టెంబర్ 27, 2014న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను డిసెంబర్ 11, 2014న ఆమోదించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. సంవత్సరంలో అత్యధిక పగటి సమయముండే రోజు జూన్ 21.

Also Read:RRB Technician Recruitment 2025: 10th అర్హతతో రైల్వే జాబ్ కొట్టే ఛాన్స్.. 6,180 టెక్నీషియన్ జాబ్స్ రెడీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కొత్త థీమ్‌ను ప్రకటిస్తారు. ఈ సంవత్సరం కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ 2025 యోగా దినోత్సవం థీమ్‌ను ప్రకటించారు. “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” అనేది ఈ ఏడాది థీమ్.

Exit mobile version