Site icon NTV Telugu

Police Commemoration Day: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. అసలు ఎందుకు జరుపుకొంటారో తెలుసా..?

Police

Police

Police Commemoration Day: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎం రేవంత్, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ విభాగం త్యాగస్ఫూర్తిని స్మరించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.. నేటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. అసలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటామో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: CM Chandrababu: గూగుల్ పెట్టుబడి వైజాగ్కి రావడానికి కారణం లా అండ్ ఆర్డర్..

ఏటా అక్టోబర్‌ 21నే పోలీస్‌ అమలరవీరుల దినత్సోవం జరుపుకుంటాం. ఇందుకు ప్రధాన కారణం 1959, అక్టోబర్‌ 21, భారత్‌–చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి.. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న అక్సాయ్‌ చిన్‌లోని హాట్‌ స్ప్రింగ్స్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందంపై చైనా దళాలు మెరుపుదాడి చేశాయి. చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది.

READ MORE: RAPO : రామ్ – భాగ్యశ్రీ.. లవ్ కన్ఫమ్ చేసిన ‘చౌ మామ’..

ఎలాంటి కవ్వింపులు లేకపోయినా చైనా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది భారత పోలీసులు బలయ్యారు. మృతదేహాలను 23 రోజుల తర్వాత అంటే 1959, నవబంర్‌ 12న చైనా అప్పగించింది. వీరులకు సైనిక గౌరవాలతో అంత్యక్రియలు జరిగాయి. మరుసటి ఏడాది అక్టోబర్‌ 21 నుంచి పోలీస్‌ అమరులు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా నివాళులు అర్పిస్తున్నారు. పోలీసు స్మారక దినోత్సవం 1959లో మరణించిన పోలీసుల గౌరవార్థం, వారిని స్మరించుకోవడానికి నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటాం. దేశీయంగా లేదా అంతర్జాతీయంగా విధి నిర్వహణలో అమరుల త్యాగాలను కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం. 2018 అక్టోబర్‌ 21న జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ నేషనల్‌ పోలీస్‌ మెమోరియల్‌ను అంకితం చేశారు.

Exit mobile version