Site icon NTV Telugu

Malladi Vishnu : మాస్టర్ ప్లాన్ మార్పు.. మీపై విచారణ తప్పదు..

Malladhi

Malladhi

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. చట్టప్రకారం లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయాలని ప్రభుత్వాని సీఐడీ పోలీసులు కోరారు. తమకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకున్నట్లు అందులో వెల్లడించారు. ఏ1 చంద్రబాబు, ఏ2 నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్ మార్పు జరిగినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

Also Read : Samyuktha Menon: పాడు పని చేసిన వ్యక్తి.. చెంప పగలగొట్టిన సంయుక్త

లింగమనేని, హెరిటేజ్ ఆస్తులు పోకుండా మాస్టర్ ప్లాన్ ను మార్చినట్లు సీఐడీ తెలిపింది. భూమి విలువ పెరిగి వారికి లబ్దికలిగేలా ఈ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు ఆరోపించారు. ఈ భూములకు పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్ పోయే విధంగా ప్లాన్ రెడీ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూ కుంభకోణంపై విచారణ చేపట్టాం అని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా అడ్డుకున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఎందుకు!? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.

Also Read : Padi Udaynandan Reddy : మనం అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గం

సుప్రీంకోర్టు ఈ మధ్యనే విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. చంద్రబాబు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనాన్ని లూటీ చేస్తే విచారణ సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అంటూ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? అంటూ ఆయన మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది.. ఇంకా కొంత మంది పేర్లు బయటకు వస్తాయని మల్లాది విష్ణు అన్నారు.

Also Read : Mobile Phone tracking system: ఫోన్ పోయిందా..? భయపడాల్సిన అవసరం లేదు.. మే 17న కొత్త ట్రాకింగ్ సిస్టమ్ అమలు..

అమరావతి ప్రకటనకు ముందే భూములను కోనుగోలు చేసి వాటిని బినామి పేర్లతో ఉన్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కుంభకోణాన్ని బయటపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా రాకముందే అక్రమంగా భూమిని కొనుగోలు చేసినట్లు నిజం కావడంతో వాటిపై సీఐడీ దర్యాప్తు చేస్తుందని మల్లాది విష్ణు అన్నారు.

Exit mobile version