Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Do Dogs Howl at Night: రాత్రి పూట ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఏదో తెలియని నిశ్శబ్దం. అంతా హాయిగా నిద్రపోతున్న సమయంలో సడన్‌గా ఎక్కడి నుంచో కుక్క కూత పెట్టడం లేదా ఏడుస్తున్నట్లుగా సుదీర్ఘంగా సౌండ్ చేయడం వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. వెంటనే మనస్సులో రకరకాల అనుమానాలు మొదలవుతాయి. అసలు కుక్క ఎవరిని చూసి ఏడుస్తోంది? దానికి దెయ్యాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పల్లెటూర్లలో, చిన్న చిన్న పట్టణాల్లో ఇప్పటికీ రాత్రి పూట కుక్క ఏడిస్తే ఏదో ఆపద రాబోతోందని, లేదా దెయ్యాలు తిరుగుతున్నాయని గట్టిగా నమ్ముతుంటారు. మరి ఇందులో నిజమెంత? కుక్కలు నిజంగానే ఆత్మలను చూడగలవా? దానికి ఏమైనా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా అంటే.. ఖచ్చితంగా లేదనే చెప్పాలి. నిజానికి రాత్రి వేళల్లో కుక్కలు అలా అరిచినా, ఏడ్చినట్లు సౌండ్ చేసినా దానికి వెనుక వాటి సహజ ప్రవర్తన, చుట్టూ ఉండే వాతావరణమే ప్రధాన కారణాలు.
ఒకదానితో ఒకటి మాట్లాడుకునే పద్ధతి..
అమెరికన్ కేనెల్ క్లబ్ (AKC) ప్రకారం… కుక్కలు అలా ఏడవటం లేదా ఎక్కువ సేపు సౌండ్ చేయడం అనేది ఒకదానితో ఒకటి మాట్లాడుకునే పద్ధతి. దూరంగా ఉన్న ఇతర కుక్కలకు సంకేతాలు ఇవ్వడానికి, లేదా తాము ఎక్కడ ఉన్నామో చెప్పడానికి అలా చేస్తాయట. కాబట్టి రాత్రి పూట కుక్కల శబ్దం వినగానే దెయ్యాన్ని చూసి భయపడుతోందని అనుకోవడం పొరపాటే. దీని వెనుక చాలా సాధారణమైన కారణాలు ఉంటాయి. అసలు పగలు లేనిది రాత్రే కుక్కల శబ్దాలు ఎందుకు ఎక్కువగా వినపడతాయి? నిజానికి కుక్కలు కేవలం రాత్రి మాత్రమే అరుస్తాయని అనుకోవడం పొరపాటు. పగటిపూట ట్రాఫిక్, మనుషుల లౌడ్ సౌండ్స్ వల్ల వాటి అరుపులు మనకు అంతగా వినిపించవు. రాత్రిపూట ప్రశాంతంగా ఉండటంతో ఆ శబ్దం చాలా దూరాల వరకు స్పష్టంగా వినిపిస్తుంది. మరో ముఖ్యం విషయం ఏంటంటే, మనుషుల కంటే కుక్కల వినికిడి శక్తి చాలా ఎక్కువ. మనం వినలేని అతి విచిత్రమైన, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే శబ్దాలను కూడా అవి చాలా సులభంగా పట్టేస్తాయి. అందుకే కుక్క ఏమీ లేకుండానే ఊరికే ఏడుస్తోందని మనం అనుకుంటాం, కానీ దానికి ఏదో శబ్దం వినిపించి దానికి రెస్పాన్స్ ఇస్తూ ఉండే అవకాశం ఉంది.
Also Read
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
ఇంకో కుక్కకు బదులు ఇవ్వడం..
అలాగే ఒక ఏరియాలో ఉన్న కుక్క అరిస్తే, దూరంగా ఉన్న ఇంకో కుక్క దానికి బదులిస్తుంది. ఓ వెటర్నరీ డాక్టర్ సైతం ఇదే విషయం చెబుతోంది. సైరన్ శబ్దాలు, టీవీ సంగీతం లేదా వేరే కుక్కల అరుపులు విన్నప్పుడు కుక్కలు ఇలా స్పందిస్తాయట. ఒక కుక్క గట్టిగా అరిస్తే.. దాన్ని విని వరుసగా మిగతా కుక్కలు కూడా అలాగే శబ్దాలు చేయడం మొదలుపెడతాయి. కాబట్టి రాత్రికి రాత్రే అక్కడ ఏదో భయంకరమైనది జరిగిపోతోందని కంగారు పడాల్సిన పనిలేదు, అదొక సాధారణ సంభాషణ మాత్రమే. అంతేకాదు.. కుక్కలు తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఇలా చేస్తాయట. అడవి తోడేళ్ళు తమ గుంపులోని మిగతా సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి పెద్దగా ఊళ వేస్తాయి. మన ఇంట్లో, వీధుల్లో ఉండే కుక్కలలో కూడా అదే అలవాటు కొంతవరకు ఉంది. అది మనకి ఏడుపులా వినిపించినప్పటికీ, దాని భాషలో అది వేరే కుక్కలతో మాట్లాడుతోందన్నమాట.
భయం, ఒంటరి తనం వల్ల అరుపు..
కొన్నిసార్లు ఒంటరితనం, భయం కూడా ప్రధాన కారణాలు కావచ్చు. చాలాసేపు ఒంటరిగా ఉన్నప్పుడు తమ యజమానిని లేదా వేరే కుక్కలను పిలవడానికి ఇలాంటి సౌండ్స్ చేస్తాయట. తమ యజమానికి దూరంగా ఉన్నప్పుడు కొద్దిగా భయం, ఆందోళన చెందే అలవాటు (సెపరేషన్ ఎంక్జైటీ) కొన్ని కుక్కలకు ఉంటుంది. అలాంటి సమయంలో యజమాని ఇంట్లో లేకపోతే రాత్రివేళల్లో మరింత ఎక్కువగా ఏడుస్తాయట. మరో ముఖ్యమైన కారణం తమ భూభాగాన్ని కాపాడుకోవడం. కుక్కలు తమ ఏరియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. రాత్రిపూట అక్కడ కొత్త వ్యక్తులు, వేరే జంతువులు లేదా ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే అలర్ట్ అయి సౌండ్ చేస్తాయట. ఈ ఏరియా మాది, ఇటువైపు రావొద్దు అని వేరే జంతువులను బెదిరించడానికి కూడా అలా చేస్తాయట. అయితే ప్రతిసారి ఇది సాధారణమైనదే కాకపోవచ్చు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుక్క సడన్‌గా రాత్రిపూట ఆగకుండా ఏడుస్తూ ఉంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఏదైనా శారీరక నొప్పి లేదా అనారోగ్యం వల్ల కూడా కుక్కలు ఇలా అరిచే అవకాశం ఉందట.
మరి ఈ దెయ్యాలు, ఆపదలు అనే నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
పూర్వకాలం నుంచి అనేక సంస్కృతుల్లో కుక్క ఊళ వేస్తే చావుకు, అపశకునానికి సంకేతంగా భావించేవారు. మనుషులు పసిగట్టలేని చిన్న చిన్న కదలికలు, శబ్దాలను కూడా కుక్కలు పసిగట్టగలవు కాబట్టి ప్రజలు వాటిని దెయ్యాలతో ముడిపెట్టడం మొదలుపెట్టారు. కానీ కుక్క ఏడిస్తే మరణాన్ని లేదా అపశకునాన్ని ముందే చెప్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషులకు కనిపించని, వినపడని వాటికి కుక్క స్పందిస్తోందే తప్ప, అది దెయ్యాన్ని చూస్తోందని భావించలేము. కాబట్టి ఇకపై రాత్రిపూట కుక్క ఏడుస్తున్నట్లు అనిపిస్తే భయపడకండి. పక్క వీధిలో మరో కుక్క అరిచి ఉండవచ్చు, లేదా ఏదైనా సైరన్ శబ్దం వినిపించి ఉండవచ్చు. లేదంటే దానికి భయం, ఒంటరితనం అనిపించి ఉండవచ్చు. ఒకవేళ ఆగకుండా ఏడుస్తుంటే దానికి ఏమైనా దెబ్బ తగిలిందా లేదా ఆరోగ్యం బాగాలేదా అని పరిశీలించండి. అంతేతప్ప, రాత్రి కుక్క ఏడవడం వెనుక ఎలాంటి భయంకరమైన దెయ్యాలు గానీ, అపశకునాలు గానీ లేవనేది సైన్స్ చెబుతున్న నిజం.
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?