Arshad Nadeem: అర్షద్ నదీమ్.. ఇప్పుడు ఈ పేరు పాకిస్తాన్‌లో సంచలనంగా మారింది. మన ఇండియా కూడా ఫేమస్ అయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఏకంగా స్వర్ణం సాధించాడు. మన దేశానికి చెందిన నీరజ్ చోప్రా రజతం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్న తొలి పాకిస్తాన్ అథ్లెట్‌గా అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్లలో పాకిస్తాన్‌కి ఇదే తొలి స్వర్ణపతకం. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకున్నా, పూర్తిగా పేదరికం బ్యాక్‌గ్రౌండ్ కలిగిన అర్షద్ నదీమ్ సాధించిన ఘనత ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు..? హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై రాహుల్ గాంధీ…
నిజానికి అర్షద్ ముందుగా క్రికెటర్ కావాలనుకున్నట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. అయితే, అతను తన కలను వదిలేసుకోవాల్సి వచ్చిందని సోదరుడు షాహిద్ అన్నారు. ఇందుకు దోహదం చేసిన పరిస్థితుల్ని వివరించాడు. ‘‘మాది తొమ్మిది మంది సభ్యులు ఉన్న కుటుంబం. ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు, మా తల్లిదండ్రులు ఉండేవారం. మా నాన్న భవన నిర్మాణ కార్మికుడు. మా కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి. క్రికెట్ ఖరీదైన క్రీడ కావడంతో దానిని భరించలేకపోయాము’’ అని షాహిద్ చెప్పారు.
పాఠశాలలో ఉన్న సమయంలో అతను క్రీడల వైపు ఆకర్షితమయ్యాడని షాహిద్ చెప్పాడు. మొదట్లో అర్షద్ 200 మీటర్స్, 400 మీటర్స్ లాంగ్ జంప్, జావెలిన్ ఇలా అన్నింటిలో పాల్గొనేవాడని చెప్పారు. అయితే మా స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు నదీమ్ ఏదో ఒక దానిపై దృష్టిపెట్టాలని సలహా ఇవ్వడంతో అతను జావెలిన్ ఎంచుకున్నారని చెప్పాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అద్బుతమైన ఫీట్‌ను ప్రదర్శించినందుకు ఏస్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను పాకిస్తాన్ దేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం హిలాల్-ఎ-ఇమ్తియాజ్‌తో సత్కరిస్తుంది. వచ్చే వారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘అజ్మ్-ఇ-ఇస్తేహ్కామ్’ (స్థిరత్వానికి నిబద్ధత) పేరుతో స్మారక స్టాంపును విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.