NTV Telugu Site icon

Water Bottle Cap Colors: వాటర్ బాటిల్ క్యాప్స్ రంగులలో తేడాలు ఉన్నాయని ఆలోచించారా? అలా ఎందుకంటే?

Water Bottels

Water Bottels

Water Bottle Cap Colors: రోజువారీ పనిలో ఖచ్చితంగా ఒక మనిషి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి. ఇల్లు లేదా ఆఫీసులో మన పరిసరాల ప్రాంతాల్లో ఉన్న నీటిని తాగడం మామూలు విషయమే. ఇకపోతే మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్న సమయంలో ఇంటి నుంచి మీరు తీసుక వెళ్లని సమయంలో కచ్చితంగా బయట వాటర్ బాటిల్లను కొనుగోలు చేయడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కొనుగోలు చేస్తున్న సమయంలో వాటర్ బాటిల్ మూత రంగును ఎప్పుడైనా గమనించారా.? గమనించిన సమయంలో వాటర్ బాటిల్ మూత కలర్ ఎందుకు అలా ఉంటుందో? దాని అర్థం ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నించారా.? వాటర్ బాటిల్ కలర్ ను బట్టి ఆ వాటర్ బాటిల్ లో ఎలాంటి నీరు నింపబడిందన్న విషయాన్ని తెలియజేస్తుంది. మరి ఆ విషయాలను ఓసారి చూద్దామా

Iran- Israel Conflict: ఇజ్రాయెల్ దెబ్బకి భయపడి గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్‌

మనం ఎక్కువగా ప్రయాణం చేస్తున్న సమయంలో బస్టాండ్ లేదా రైల్వేస్టేషన్లో ఎక్కువగా వాటర్ బాటిల్ని కొనడం చేస్తుంటాము. ఆ సమయంలో వందకు 95 శాతం వరకు వాటర్ బాటిల్లపై ఉన్న మూత నీలం కలర్ లో ఉండడం గమనించవచ్చు. ఇలా బ్లూ కలర్ ఉన్న క్యాపులు ఉన్న బాటిళ్లలో కేవలం మినరల్ వాటర్ నింపి ప్యాక్ చేసిందని అర్థం. ఇలా వివిధ రకాల నీటిని నింపి వాటి బాటిల్స్ పై మూతను పెట్టడం జరుగుతుంది. ఇక తెల్లటి రంగు మూత ఉన్న బాటిల్ అయితే అందులో సాధారణ తాగు నీరు నింపి ఉంటుందని అర్థం.

Bathukamma 2024: నేడు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?

అలాగే ఆకుపచ్చ మూత ఉన్న వాటర్ బాటిల్లో రుచికరమైన నీటిని సూచిస్తుంది. ఇంకా వాటర్ బాటిల్ క్యాప్ రంగు ఎరుపు రంగులో ఉంటే అందులో కార్బోనేటెడ్ నీటిని సూచిస్తుంది. అలాగే పసుపు మూత ఉన్నట్లయితే అందులో విటమిన్లు అలాగే ఎలక్ట్రోలైట్లలతో సమృద్ధిగా ఉన్న నీటిని కలిగి ఉంటుంది. అలాగే నలుపు రంగు మూత ఉన్న బాటిల్ల విషయానికొస్తే.. అందులో ఆల్కలైన్ వాటర్ కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువగా బ్రాండెడ్ వాటర్ బాటిల్లలో కనబడుతుంది. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పింక్ (గులాబీ) రంగు ఉన్న మూత రొమ్ము క్యాన్సర్ అవగాహనతో ముడిపడి ఉంటుంది.